టింటూకు రజతం, 50కి చేరిన పతకాలు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా ఈ వెండి పతకాన్ని సాధించింది.
1:59:19 సెకన్లలో గమ్యస్దానాన్ని చేరి ఆమె వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంచియాన్‌లోని గ్యాంగ్‌జూ స్టేడియంలో ఈ మహిళల పరుగు పందేలు జరిగాయి. ఇక భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి సుష్మా దేవి నాల్గవ స్దానంలో నిలిచింది.
ఆమె 2:01:92 సెకన్లలో గమ్యస్దానాన్ని చేరుకుంది. కజకిస్దాన్‌కు చెందిన మార్గారిటా స్వర్ణం, చైనాకు చెందిన జింగ్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
మహిళల జావిలిన్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. జావిలిన్ త్రోలో అన్ను రాణి సాధించిన ఈ మెడల్‌తో భారత్‌కు పతకాల పట్టికలో 50 మెడల్ వచ్చి చేరింది. దీంతో దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకలా పట్టికలో 7 బంగారు, 9 వెండి, 34 కాంస్య పతకాలు సాధించింది.

టింటూ లుకాకు రజతం
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది.

టింటూ లుకాకు రజతం
మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా ఈ వెండి పతకాన్ని సాధించింది.

టింటూ లుకాకు రజతం
1:59:19 సెకన్లలో గమ్యస్దానాన్ని చేరి ఆమె వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంచియాన్‌లోని గ్యాంగ్‌జూ స్టేడియంలో ఈ మహిళల పరుగు పందేలు జరిగాయి.

టింటూ లుకాకు రజతం
ఇక భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి సుష్మా దేవి నాల్గవ స్దానంలో నిలిచింది. ఆమె 2:01:92 సెకన్లలో గమ్యస్దానాన్ని చేరుకుంది. కజకిస్దాన్‌కు చెందిన మార్గారిటా స్వర్ణం, చైనాకు చెందిన జింగ్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications