Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఒక్క రోజుకు నాతో వాలెంటైన్‌గా ఎవరైనా..' అంటూ ట్విట్టర్లో సందేశం

Tiger Woods' ex-girlfriend Lindsey Vonn wants a date for Valentine's Day: Genie Bouchard replies!

హైదరాబాద్: వింటర్ ఒలింపిక్స్‌లో అసలే చలి పైగా ప్రేమికుల రోజు అలాంటి సమయంలో సెలబ్రిటీ డేటింగ్ సిద్ధంగా ఉన్నానంటూ మెసేజ్. ఆ దెబ్బకి రెక్కలు కట్టుకుని వెళ్లిపోవాలనే ఉత్సాహం వచ్చుంటది నెటిజన్లకు.. బదులుగా 2 వేల మంది సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. లిండ్సే వాన్.

అమెరికా స్కై రేసింగ్ అథ్లెట్‌ లిండ్సే వాన్‌ ట్విటర్‌లో తనను అనుసరిస్తున్న దాదాపు పది లక్షల మంది అభిమానులకు ఒక సందేశం పెట్టింది. అదేంటంటే.. ''ఈరోజు ప్రేమికుల రోజు. వింటర్‌ ఒలింపిక్స్‌లో ఒంటరిగా ఉన్నా.. ఈ రోజుకి ఎవరైనా అవుతారా నా ప్రేమికుడు'' అని సందేశం పెట్టింది. అంతే వేలల్లో అభిమానులు స్పందించారు.

దేవుడా నాకు ఒక్క అవకాశం ఇప్పించు. ప్యాంగ్ చాంగ్‌లో ఆమెకు నా ప్రేమను పరిచయం చేస్తా. అంటూ ఘాటుగానే స్పందనలు వచ్చాయి. దాదాపు 2వేల మంది ఆమె ట్వీట్ కు బదులిచ్చి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. లిండ్సే వాన్‌ గతంలో గోల్ఫర్‌ టైగర్‌ వుడ్స్‌తో రెండేళ్లు పాటు డేటింగ్‌ చేసింది. 2015లో విడిపోయారు.

Story first published: Thursday, February 15, 2018, 16:05 [IST]
Other articles published on Feb 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+