మ్యాచ్‌ని 'టై' గా ప్రకటించడం ఖచ్చితమైన నిర్ణయం: కుక్

ఈ సందర్బంలో కెప్టెన్ అలెస్టర్ కుక్ మాట్లాడుతూ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రవేశపెట్టగా మ్యాచ్ చివరకు చాలా ఉత్కంఠగా సాగింది. ప్రతి బాల్ కూడా మాకు చాలా ముఖ్యమైనదిగా భావించడం జరిగింది. రెండు వైపులా కూడా ఎంతో ఉత్కంఠతో కొనసాగిన ఈమ్యాచ్ చివరకు టైగా ముగియడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంపైర్లు చివరకు ఆటను టై రిజల్టుని ప్రకటించడం ఖచ్చితమైన నిర్ణయంగా భావిస్తున్నాను.
ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లు రవిబొపారా, టిమ్ బ్రెస్నన్, గ్రేమ్ స్వాన్ ఆడినటువంటి ఆటతీరు అద్బుతం. ఈ సిరిస్ నెగ్గడానికి కారణం కూడా ఒకవిధంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడిన ఆటతీరు కూడా కారణం. ఇంగ్లాండ్ 270 పరుగులు చేసి 8 వికెట్లు కొల్పోయిన సమయంలో మూడవ సారి పడిన వర్షం డక్ వర్త్ లూయిస్ పద్దతిని ప్రవేశపెట్టడం జరిగింది.అంతేకాకుండా స్కోరు 44 ఓవర్లలో ఆరు వికెట్లకు 233. ఈ దశలో వర్షం... డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ 235 పరుగులు చేస్తే మ్యాచ్ టై. అంటే ఇంగ్లండ్ రెండు పరుగులు వెనకబడింది. భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరగా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అక్కడే నిలబడ్డారు. ఈ దశలో వర్షం ఆగింది. మళ్లీ అంపైర్లు ఆటగాళ్లను పిలిచారు.
మునాఫ్ వేసిన 45వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఇంగ్లండ్‌స్కోరు 242 పరుగులకు చేరింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ మళ్లీ ఆగింది. ఈసారి భారత ఆటగాళ్లు అక్కడే నిలబడితే, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చకచకా పెవిలియన్‌కు చేరారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ 240 పరుగులు చేస్తే సరిపోతుంది. ఒక్క ఓవర్ తిరిగే సరికి ఇంగ్లండ్ రెండు పరుగులు ముందుకు వచ్చింది. పది నిమిషాల్లోనే వర్షం ఆగడంతో మళ్లీ మ్యాచ్ మొదలయింది. ఈసారి 48.5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 270... మళ్లీ వర్షం. ఈసారి కుండపోత. డక్‌వర్త్ పద్ధతి ప్రకారం స్కోర్లు సమం. అంటే మ్యాచ్ టై. వర్షంతో మ్యాచ్ ఆగడానికి ముందు రెండు బంతుల్లో రెండు వికెట్లు పడటంతో డక్‌వర్త్ ప్రకారం ఇంగ్లండ్ 270 పరుగులు చేయాల్సి వచ్చిందని అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications