న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా ఈ ఆదివారం భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌లో వస్తున్న ఓ యాడ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రపంచకప్‌లో భాగంగా వస్తున్న స్టార్ స్పోర్ట్స్‌లో వస్తున్న మౌకా మౌకా ప్రకటన పైన మండిపడుతున్నారు.
ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రసార హక్కులను స్టార్ టీవీ చేజిక్కించుకుంది. ఇది వాణిజ్య ప్రకటనల పేరిట క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రధాన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల పైన ఆ టీవీ ప్రసారం చేస్తున్న యాడ్స్ వివాదాస్పదం కూడా అవుతున్నాయి.
<center><iframe width="100%" height="360" src="https://www.youtube.com/embed/OSP7o4lzIoQ?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
అభిమానులలో వేడి పుట్టిస్తున్నాయి. భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా విడుదల చేసిన యాడ్‌లో... పాక్ గెలుస్తుందని భావించిన ఓ అభిమాని సంబరాలు చేసుకునేలోగానే ఆ దేశ జట్టు ఓడిపోవడం తెలిసి అభిమాని నిరాశలో కూరుకుపోతాడు. సంబరాల కోసం సిద్ధం చేసుకున్న టపాసులు బూజు పట్టినట్లుగా యాడ్‌లో చూపించారు. దీనిపై పాక్ అభిమానులు మండిపడ్డారు.
తాజాగా, ఆ యాడ్ మనకు రివర్స్ అయింది. దీని పైన భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. దీంతో స్టార్ స్పోర్ట్స్ మరో రకమైన యాడ్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో... సఫారీల డ్రెస్ వేసుకున్న ఇద్దరు దక్షిణాఫ్రికావాసులు మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న భారత జట్టు అభిమానులకు టపాసులు అందజేస్తారు. ఆ తర్వాత మోకా.. మోకా అంటూ వెళ్లిపోతారు.
ప్రపంచకప్‌లో.. ఇప్పటి వరకు భారత్ పైన పాక్ గెలవలేదు. అలాగే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మూడుసార్లు భారత్ గెలువలేదు. సఫారీలదే పై చేయిగా ఉంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ యాడ్ భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.