
ఇప్పుడే ఎవరికీ థ్యాంక్స్ చెప్పట్లే..
తనకు పతకం ఖాయం కావడం వల్ల దేశవ్యాప్తంగా వేలాదిమంది శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారని, వారికి తాను ఇప్పుడే కృతజ్ఞతలు చెప్పదలచుకోలేదని లవ్లీనా బొర్గోహెయిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం స్వర్ణ పతకాన్ని సాధించడంపైనే ఉందని తేల్చి చెప్పారు. దాన్ని సాధించడానికి కసరత్తు చేస్తోన్నానని అన్నారు.
తన మనస్సులో బంగారు పతకం తప్ప మరొకటి లేదని, తన కంటికి మరో మెడల్ కనిపించట్లేదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యం తన ముందు ఉందని ఆమె తేల్చి చెప్పారు. ఫైనల్ ముగిసిన తరువాత దేశ ప్రజలకు రెట్టించిన ఉత్సాహంతో కృతజ్ఙతలు తెలియజేస్తానని చెప్పారు.

మహ్మద్ అలీని చూసి
లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీని చూస్తూ తాను పెరిగానని, ఆయన ఫుట్‌వర్క్‌ను తాను అనుసరించే ప్రయత్నం ప్రతీసారి చేస్తానని లవ్లీనా అన్నారు. మహ్మద్ అలీ ఫుట్‌వర్క్ ఓ అద్భుతమని వ్యాఖ్యానించారు. అలాగే- లాంగ్ పంచ్‌లన విసరడంలో ఆయనకు తిరుగు లేదని చెప్పారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపేకు చెందిన ప్రత్యర్థిపై లాంగ్ పంచ్‌లను విసరడానికి కొద్దో, గొప్పో ప్రయత్నం చేశానని అన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి.. జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్న మేరీ కోమ్ జీవితం తనకు ఆదర్శమని, ఆమె నుంచి స్ఫూర్తి పొందానని లవ్లీనా పేర్కొన్నారు.

ఒత్తిడి ప్రతిసారీ ఉంటుంది..
ఒత్తిడి అనేది ప్రతిసారీ ఉంటుందని, బౌట్ ప్రారంభానికి ముందు- ప్రతి బాక్సర్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారని లవ్లీనా అన్నారు. ఈ సారి ఒత్తడిలో ఆడకూడదని, దాని ఆధీనంలోకి వెళ్లకూడదని సంకల్పించానని చెప్పారు. ఒక్కసారి ఒత్తిడిలోకి వెళ్తే.. దాని తీవ్రత ప్లేయర్ పెర్‌ఫార్మెన్స్‌పై కనిపిస్తుందని అన్నారు.
దేశం మొత్తం తన కోసం ప్రార్థించిందని, దాని ఫలితంగాను విజయం సాధించగలిగానని పేర్కొన్నారు. పతకాన్ని సాధించాలనే తపనతో శక్తివంచన లేకుండా కృషి చేశానని అన్నారు. ఇక స్వర్ణ పతకం కోసం కఠోరంగా శ్రమించాల్సి ఉందని చెప్పారు.

రజతం ఖాయం..
సెమీ ఫైనల్‌లో ఆమె ఓడినప్పటికీ..రజత పతకాన్ని అందుకుంటారు. విజయాన్ని గనక సాధించగలిగితే రజతానికి, ఓటమి లేకుంటే స్వర్ణాన్ని సాధించగలరు లవ్లీనా. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం- నాలుగు కేటగిరీల్లో సెమీ ఫైనల్స్‌కు చేరిన ప్రతి బాక్సర్ కూడా పతకానికి అర్హులే. క్వార్టర్ ఫైనల్స్ టై కావడమో లేదా.. మూడో స్థానంలో నిలవడమో జరిగితే తప్ప- మెడల్ అందుకోలేరు బాక్సర్లు. క్వార్టర్‌ఫైనల్స్‌లో లవ్లీనా బొర్గోహెయిన్ అద్భుతంగా సత్తా చాటారు. ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఈ గేమ్‌లో ఆమె విజేతగా ఆవిర్భవించారు. సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టారు. దీనితో ఆమెకు పతకం ఖాయమైంది.

తొమ్మిదేళ్ల కఠోర శ్రమ..
2012లోనే బాక్సింగ్‌పై లవ్లీనాకు ఆసక్తి ఏర్పడింది. గువాహటిలోని నేతాజీ సుభాష్ రీజనల్ సెంటర్‌లో ఆమె శిక్షణ పొందారు. పదుమ్ బోరో ఆమె మొట్టమొదటి కోచ్. బాక్సింగ్‌తో తన ప్రత్యర్థి బరువును అంచనా వేయడం అత్యవసరమని, దానికి అనుగుణంగా అతణ్ని అలసిపోయేలా చేయాలనేది ప్రాథమిక సూత్రమని కోచ్ అలీ ఖమర్ పేర్కొన్నారు. ఈ రౌండ్‌లో కూడా లవ్లీనా తన ప్రత్యర్థి బరువు, బలం, బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతమయ్యారని చెప్పారు.

మూడో బాక్సర్‌గా..
ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత మూడో బాక్సర్ లవ్లీనా. ఇదివరకు ఒలింపిక్స్ బాక్సింగ్ కేటగిరీలో మేరీ కోమ్, విజేందర్ సింగ్ మాత్రమే పతకాన్ని సాధించారు. ఇప్పుడీ జాబితాలో లవ్లీనా చేరారు. అస్సాంకు చెందిన 23 సంవత్సరాల లవ్లీనాకు ఇదే తొలి ఒలింపిక్స్. కొత్తే అయినప్పటికీ.. ఎక్కడా తడబాటును ప్రదర్శించలేదు.
సరైన సమయంలో కౌంటర్ అటాక్ చేశారు. ప్రత్యర్థిని కదలనివ్వలేదు. చైనీస్ తైపే ప్రత్యర్థి బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దూకుడు, ఎదురు దాడే మంత్రంగా రజత పతకాన్ని ముద్దాడబోతోన్నారు. 4-1తో ప్రత్యర్థిని మట్టికరిపించారంటే ఆమె ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications












