For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: ప్రపంచమే సలామ్ కొట్టేలా ‘భారత్ హాకీ’

పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో తొమ్మిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో మించి మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు పారిస్‌కు బయలుదేరారు. అయితే ఎప్పటిలానే అందరి ఆశలు భారత హాకీ జట్టుపైనే ఉన్నాయి.

ప్రపంచ వేదికపై స్వత్రంత భారత్‌ను విజేతగా పరిచయం చేసింది హాకీ ఆటతోనే. అందుకే ఒలింపిక్స్ అంటే అందరికీ తొలుత గుర్తొచ్చేది హాకీనే. హాకీతో మన దేశ ప్రజలకు ఉన్న భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేనిది. భారత్ సగర్వంగా తలెత్తుకునేలా మన హాకీ ప్లేయర్లు ఆది నుంచి పోరాడుతూనే ఉన్నారు. పతక లక్ష్యంగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో భారత పురుషల జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమైంది.

The Unbreakable Bond Between Indian Hockey and Emotions at the Paris 2024 Olympics

ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్యలో హాకీదే ప్రధాన భాగం. సాధించిన 35 మెడల్స్‌లో 8 స్వర్ణ పతకాలు, ఓ సిల్వర్, ఓ కాంస్య పతకం పురుషుల హాకీలోనే రావడం విశేషం. ప్రత్యర్థులను వణికిస్తూ ఏకంగా రెండుసార్లు హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌‌తో సత్తా చాటింది. స్వాతంత్రానికి ముందు 1928లో భారత హాకీ జట్టు తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.

తొలి ప్రయత్నంలోనే భారత్ బంగారు పతకాన్ని అందుకుంది. మేజర్ ధ్యాన్‌చంద్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ 1928లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. 1932, 1936 ఒలింపిక్స్‌లోనూ స్వర్ణాన్ని సాధించిన భారత్ హ్యాట్రిక్ మెడల్స్ సాధించింది. అంతేగాక 1948, 1952, 1956 ఒలింపిక్స్‌లోనూ ఇండియాకు హ్యాట్రిక్ మెడల్స్ దక్కాయి.

ఆ తర్వాత కూడా భారత హాకీ జట్టు అదే జోరును కొనసాగించింది. 1960‌లో రజతం, 1964 మరో స్వర్ణాన్ని గెలిచింది. 1968, 1972లో జరిగిన విశ్వక్రీడల్లో కాంస్యాన్ని అందుకుంది. 1980లోనూ బంగారు పతకంతో సత్తాచాటింది. కానీ ఆ తర్వాత భారత హాకీ జట్టు తడబడింది. అంచనాలు అందుకోలేకపోయింది. పతకాన్ని అందుకోలేక 41 ఏళ్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చింది.

కానీ గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత పోరాటంతో తిరిగి పతకాల బాట పట్టింది. కొవిడ్ కష్టకాలాన్ని గొప్పగా ఎదుర్కొని సన్నద్ధమైంది. గొప్పగా పోరాడింది. జర్మనీతో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఈసారి స్వర్ణం లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పూల్‌-బిలో ఆడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌ ఇదే పూల్‌లో ఉన్నాయి.

Story first published: Wednesday, July 17, 2024, 18:18 [IST]
Other articles published on Jul 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+