
కాబోయే భర్తను కోనేరు హంపి శుక్రవారం పరిచయం చేశారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం కోనేరు హంపి నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. అన్వేష్ అమెరికాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు. ప్రపంచ చెస్ చాంపియన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకోవడానికి అన్వేష్ అండగా ఉంటారని హంపి ఈ సందర్భంగా తెలిపారు.
వివాహమైనా తాను చెస్‌ను కొనసాగిస్తానని, ప్రపంచ ఛాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని హంపీ తెలిపారు. హడావిడిగా నిశ్చితార్థం జరగడంతో ఇతరులు ఎవరినీ ఆహ్వానించలేదని కోనేరు హంపీ తల్లిదండ్రులు అశోక్, లత తెలిపారు. కోనేరు హంపీకి కాబోయే భర్త అన్వేష్ తల్లిదండ్రులు దాసరి రామకృష్ణ.