
హైదరాబాద్: ఓ పెద్ద ఛాంపియన్ షిప్ అందులోనూ రాయల్ గేమ్ అయిన చెస్. దానికి సంబంధించిన లోగోను ఎంత ఘనంగా డిజైన్ చేస్తారో కదా. కానీ, అటువంటి ఆర్భాటాలకు పోకుండా జనాల్లోకి త్వరగా వెళ్లడానికి మాంచి ట్రిక్ ఒకటి ప్లే చేశారు. లండన్‌లో జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా కొత్త లోగోను డిజైన్ చేశారు.
పలు దేశాలనుంచి వస్తున్న విమర్శలు, చెస్ నిపుణుల అభిప్రాయాలు ఒక్కోలా ఉన్నాయి. కొందరేమో చదరంగంలో 8x8 గడులుంటాయి. ఇది 6x6మాత్రమే కలిగి ఉందని చెప్తున్నారు. ఇంకొకరు రియల్ గేమ్‌లో 8x8 ఉండాల్సిన అవసర్లేదు. 6x6 ఉన్నా సరిపోతుందని సమర్ధిస్తున్నారు.
చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన మహిళా చెస్ క్రీడాకారిణి సుసాన్ పొల్గార్ ఇది పిల్లలకు ఎలా అర్తమవుతుందో ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు. చెస్ నిపుణుడు డేవిడ్ క్రమాలే మాత్రం దీని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఓపెన్‌గా చర్చించుకుంటున్నారు. ఇంతకు మించి ప్రచారానికి కావాలసింది ఏముంటుందని అని అభిప్రాయపడ్డారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.