Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1500 గుడ్లు తెమ్మంటే 15000 గుడ్లు తీసుకొచ్చారు

హైదరాబాద్: భాష తెలియని చోట బాధ ఎలా చెప్పగలం. అలా అని ఎవరినైనా నమ్ముకున్నామా.. ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఆటగాళ్ల ఆకలి తీర్చేందుకు 1500 గుడ్ల కోసం ఆర్డరిస్తే 15000గుడ్ల ఆర్డర్ వచ్చింది. తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు.

గూగుల్‌ని నమ్ముకున్నందుకే

గూగుల్‌ని నమ్ముకున్నందుకే

ఫిబ్రవరి 9 నుంచి జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు ముందుగానే ఆటగాళ్లు దక్షిణకొరియా ప్రాంతానికి వచ్చి చేరారు. నార్వే దేశానికి చెందిన ఒలింపిక్‌ జట్టుకు తమ ఆటగాళ్లు తినేందుకు రోజుకు 1,500గుడ్లు కావాలి. దాని కోసం గూగుల్‌ను ఆశ్రయించారు.

సున్నా పెరిగి.. వంద నుంచి వెయ్యకి

సున్నా పెరిగి.. వంద నుంచి వెయ్యకి

ఇంటర్నెట్ వాడకంతో తెలియని ప్రతి విషయాన్ని గూగుల్‌ని వాడి తెలుసుకుంటున్నాం. ఇక్కడ అలాంటి టెక్నిక్ నే వాడి మోసపోయారు. ఎంతైనా మెషీన్ కదా ఏం చెప్తే అదే చేస్తుంది. 1500కి బదులు సున్నా ఎక్కువ పడటంతో ఆర్డర్ 15000గా మారింది.

 నార్వే ఆటగాళ్లకు ఆహారం కోసం

నార్వే ఆటగాళ్లకు ఆహారం కోసం

దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన నార్వే ఆటగాళ్ల మేనేజ్‌మెంట్ క్రీడా నిర్వహకులకు రోజుకు 1500 గుడ్లు కావాలని ఆర్డరిచ్చింది. దాని కోసం గూగూల్ ట్రాన్స్‌లేటర్ వాడింది.

చిన్న పొరబాటు వల్ల

చిన్న పొరబాటు వల్ల

గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ను వాడి 1500 గుడ్లను 15000గా చెప్పడంతో 15000 గుడ్ల ఆర్డరు వచ్చింది. పొరబాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు. కేవలం 1500 ఉంచుకుని మిగిలిన 13500గుడ్లను వెనక్కి పంపేశారు.

ఒకొక్కరు రోజుకు 7 తింటారు

ఒకొక్కరు రోజుకు 7 తింటారు

నార్వే దేశం తరఫున ఈ ఒలింపిక్స్‌లో 109 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కొక్కరు రోజుకి ఏడుకు పైగా గుడ్లు తింటారు. అందుకే పదిహేను వందల గుడ్లు ఆర్డర్‌ ఇచ్చామని నార్వే మేనేజ్‌మెంట్ తెలిపింది. దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి శీతాకాల ఒలింపిక్స్‌ జరుగుతున్నాయి. 92 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 17:13 [IST]
Other articles published on Feb 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+