
టెర్రాస్ స్పోర్ట్స్
హైదరాబాద్ నగరంలో కొత్త ట్రెండ్ షురూ కానుంది. ఇప్పటి వరకూ క్రీడా మైదానాలంటే ఓపెన్ ఏరియాలనే అందరికీ తెలిసింది.

టెర్రాస్ స్పోర్ట్స్
కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న మెట్రో నగరాల్లో ఆడుకోవడానికి కనీస స్థలం కరవవుతోంది.

టెర్రాస్ స్పోర్ట్స్
ఇలాంటి పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా హైదరాబాదీలకు హాట్‌ఫుట్ సంస్థ ‘టెర్రాస్ స్పోర్ట్స్'ను పరిచయం చేయనుంది. చైనా, జపాన్, జర్మనీల్లోభవనాల పై అంతస్థుల్లో క్రీడా మైదానాలు కొత్తేం కాదు.

టెర్రాస్ స్పోర్ట్స్
ఇదే తరహాలో బేగంపేట్‌లోని 10 అంతస్థుల వైట్‌హౌస్ బిల్డింగ్ టెర్రాస్‌పై మైదానాన్ని ఏర్పాటు చేశారు.

టెర్రాస్ స్పోర్ట్స్
దక్షిణ భారతంలోనే ఇలాంటి బహుళ అంతస్థుల భవనంపై ప్లేయింగ్ ఏరియాను ఏర్పాటు చేయడం ఇదే మొదటిదని హాట్‌ఫుట్ ప్రతినిధులు తెలిపారు.

టెర్రాస్ స్పోర్ట్స్
నగరంలో ఫుట్‌బాల్ మైదానాలు అంతగా లేవు. భవంతులపైన టర్ప్‌తో కూడిన ఫుట్‌బాల్ కోర్టును ఇక్కడ సిద్ధం చేశారు.

టెర్రాస్ స్పోర్ట్స్
ఏకంగా రెండు కోర్టులు నిర్మించారు. బంతి బయటకు వెళ్లకుండా .. చుట్టూ ఎత్త్తెన కంచెతోపాటు, ఆటగాళ్లు గాయపడకుండా.. పడిపోకుండా... ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టెర్రాస్ స్పోర్ట్స్
ఫుట్‌బాల్ ఒక్కటే కాదు టర్ప్ మారిస్తే అక్కడ క్రికెట్ ఆడొచ్చు.. కబడ్డీ కూతపెట్టొచ్చు.. ఖోఖో, వాలీబాల్ ఆడాలన్నా ఇబ్బందులు ఉండవు.

టెర్రాస్ స్పోర్ట్స్
ఫుట్‌బాల్ టోర్నీలు, కార్పొరేట్ క్రీడలను దృష్టిలో పెట్టుకుని టెర్రాస్ గ్రౌండ్‌లు రూపుదిద్దుకుంటున్నాయి.

టెర్రాస్ స్పోర్ట్స్
సాధారణంగా ప్రైవేటు ఆటస్థలాల్లో అద్దె గంటకింతని వసూలు చేస్తారు.

టెర్రాస్ స్పోర్ట్స్
ఇక్కడ కూడా గంటల లెక్కనే అద్దెకిస్తారు. పగలే కాదు రాత్రిపూటా ఆడుకునే సదుపాయాలు ఈ కోర్టుల్లో ప్రత్యేకం.


Click it and Unblock the Notifications