Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ కు నో చాన్స్: మురళీకి చోటు

Anil Kumble
బెంగుళూర్: ఈ నెల 26వ తేదీ నుంచి చెన్నైలో దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచుల సిరీస్ కు సంబంధించి తొలి రెండు టెస్టు మ్యాచులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సోమవారం జట్టును ప్రకటించింది. జట్టులోకి కొత్తగా స్పిన్నర్ మురళీ కార్తిక్ మాత్రమే వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆడిన జట్టు సభ్యులనే దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను తొలి టెస్టు మ్యాచుకు ఎంపిక చేయలేదు. దినేష్ కార్తిక్ కు ఉద్వాసన పలికారు.

యువరాజ్, హర్భజన్ సింగ్ లకు జట్టులో స్థానం దక్కింది. జట్టు ఎంపికకు ముందు వీరిద్దరు ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కున్నారు. ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, ఆర్పీ సింగ్ లకు జట్టులో స్థానం లభించింది. అయితే గౌతం గంభీర్ కు టెస్టు జట్టులో స్థానం లభించలేదు. పియూష్ చావ్లాను స్టాండ్ బైగా పెట్టారు.

జట్టు:
  • అనిల్ కుంబ్లే (కెప్టెన్)
  • సచిన్ టెండూల్కర్
  • రాహుల్ ద్రావిడ్
  • సౌరవ్ గంగూలీ
  • వివియస్ లక్ష్మణ్
  • యువరాజ్ సింగ్
  • వసీం జాఫర్
  • వీరేంద్ర సెహ్వాగ్
  • మహేంద్ర సింగ్ ధోనీ
  • ఇర్ఫాన్ పఠాన్
  • శ్రీశాంత్
  • ఆర్పీ సింగ్
  • హర్భజన్ సింగ్
  • మురళీ కార్తిక్
  • Story first published: Monday, March 17, 2008, 17:28 [IST]
    Other articles published on Mar 17, 2008
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+