Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూనిస్ సెంచరీ: రెండో టెస్టు డ్రా


కోల్ కత్తా: బ్యాటింగుకు విపరీతంగా అనుకూలించిన కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్సులో పాకిస్తాన్, భారత్ ల మధ్య జరిగిన రెండో క్రికెట్ టెస్టు మ్యాచు డ్రాగా ముగిసింది. పాకిస్తాన్ బ్యాట్స్ మెనును త్వరగా అవుట్ చేసి విజయాన్ని కైవసం చేసుకోవాలనుకున్న ఆశలకు యూనిస్ ఖాన్ రెండో ఇన్నింగ్సులో సెంచరీ చేసి గండి కొట్టాడు. ఆట ముగిసే సమయానికి యూనిస్ ఖాన్ 107 పరుగులతో, యూసుఫ్ 44 పరుగులతో నాటవుటుగా ఉన్నారు. రెండో ఇన్నింగ్సులో పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. హమీద్, అక్మల్ 14 పరుగులేసి వ్యక్తిగత పరుగుల వద్ద, సల్మాన్ భట్ 11 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఆవుట్ కావడంతో భారత జట్టులో ఆశలు చిగురించాయి. మిస్బావుల్ హక్ ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే యూనిస్, యూసుఫ్ భారత్ ఆశలను వమ్ము చేశారు.

అనిల్ కుంబ్లేకు రెండు వికెట్లు, మునాఫ్ పటేల్, జహీర్ ఖాన్ లకు ఒకటేసి వికెట్లు లభించాయి. అంతకు ముందు భారత్ తన రెండో ఇన్నింగ్సును 184 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఆ పరుగులు చేసింది. మంగళవారంనాడు ధోనీ 37 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో గంగూలీ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ దారి పట్టాడు. గంగూలీ అవుట్ కాగానే కెప్టెన్ అనిల్ కుంబ్లే రెండో ఇన్నింగ్సును డిక్లేరు చేశాడు. సోమవారం నాడు జాఫర్ 56 పరుగులు, దినేష్ కార్తిక్ 28 పరుగులు చేసి ఆవుటయ్యారు. అక్తర్, కనేరియాలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. భారత్ తొలి ఇన్నింగ్సును 616 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. దానికి జవాబుగా పాక్ తొలి ఇన్నింగ్సులో 456 పరుగులు మాత్రమే చేసింది. మూడు టెస్టుల సిరీసులో భారత్ తొలి టెస్టును గెలుచుకుని 1-0 స్కోరుతో ముందంజలో ఉంది.
Story first published: Tuesday, December 4, 2007, 23:53 [IST]
Other articles published on Dec 4, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+