Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్‌ను చిత్తు చేసిన తెలుగు టాలన్స్‌.. ముచ్చటగా మూడో విజయం!

జైపూర్ వేదికగా జరుగుతున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ అద్భుతంగా ఆడుతోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్యాట్రియాట్స్‌పై ఘనవిజయం సాధించిన టాలన్స్.. ఈ టోర్నీలో ముచ్చటగా మూడో విజయం నమోదు చేసింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన తెలుగు టాలన్స్‌.. ఆ తర్వాత రెండు ఓటములు చవిచూసింది.

ఈ రెండు ఓటముల అనంతరం పుంజుకున్న టాలన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బుధవారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో రాజస్థాన్‌ పాట్రియాట్స్‌పై 28-24తో తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌ పాట్రియాట్స్‌ 50 సార్లు గోల్‌కు చేరువగా రాగా.. అడ్డుగోడలా నిలిచిన టాలన్స్‌ గోల్‌ కీపర్‌లు వారికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వలేదు.

 Telugu Talons register their third victory in Premiere Handball League

దీంతో ఆ జట్టు 24 గోల్స్‌తోనే సరిపెట్టుకుంది. తెలుగు టాలన్స్‌ 48 సార్లు మాత్రమే గోల్‌ ప్రయత్నం చేసినా.. వాటిలో 28 సార్లు సక్సెస్ అయ్యారు గ్రూప్‌ దశలో ఐదు మ్యాచుల్లో తెలుగు టాలన్స్‌కు ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ప్రథమార్థం అత్యంత ఉత్కంఠగా సాగింది. గోల్‌ కోసం ఇటు టాలన్స్‌, ఇటు పాట్రియాట్స్‌ చెమటోడ్చాయి.

మ్యాచ్‌లో 14 నిమిషాల వద్ద 6-6తో టాలన్స్‌, పాట్రియాట్స్‌ సమంగా నిలిచాయి.. ఆ తర్వాత రాజస్థాన్‌ 9-7తో రెండు పాయింట్ల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత తెలుగు టాలన్స్‌ పుంజుకున్నా కూడా మొదటి హాఫ్‌ను రాజస్థాన్‌ 14-13తో ఓ గోల్‌ ఆధిక్యంతోనే ముగించింది. అయితే ద్వితీయార్థం ఆరంభంతోనే తెలుగు టాలన్స్‌ దూసుకుపోయింది. ఆటగాళ్లంతా జోరు చూపించడంతో చూస్తుండగానే టాలన్స్ 16-15తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

 Telugu Talons register their third victory in Premiere Handball League

రుఘు కుమార , అనిల్‌, దేవిందర్‌ సింగ్‌ భుల్లార్‌, నసీబ్‌ సింగ్‌ సహా కెప్టెన్‌ షియోరాన్ రాణించారు. దీంతో తెలుగు టాలన్స్‌ ఒకానొక దశలో 24-19తో ఐదు గోల్స్‌ ఆధిక్యంలో నిలిచింది. రాజస్థాన్‌ పాట్రియాట్స్‌ చివరి ఐదు నిమిషాల్లో గోల్స్‌ కోసం గట్టిగా ప్రయత్నించింది. కానీ ఫలితం మాత్రం పెద్దగా దక్కలేదు. చివరకు 28-24తో నాలుగు గోల్స్‌ తేడాతో తెలుగు టాలన్స్‌ విజయం సాధించింది.

Story first published: Thursday, June 15, 2023, 16:05 [IST]
Other articles published on Jun 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+