జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు.. ఖాతాలోకి మరో పతకం!
38వ జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఖాతాలో పదో పతకం వచ్చి చేరింది. ఈ క్రీడల్లో మంచిగానే రాణించిన తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ కు కంచు పతకం దక్కింది. పురుషుల జట్టు ఈ కాంస్య పతకాన్ని అందుకుంది.
క్వార్టర్స్‌లో 3-2 తేడాతో ఉత్తర్ ప్రదేశ్‌పై విజయం సాధించిన తెలంగాణ జట్టు.. సెమీస్ లో మాత్రం ఓడిపోయింది. ఈ సెమీ ఫైనల్ లో మహారాష్ట్రపై 0-3 తేడాతో పరాజయం పాలవ్వడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ బ్రాంజ్ మెడల్ అందుకున్న టీమ్ లో అలీ మొహమ్మద్, సూరావజ్జుల స్నేహిత్, స్వర్ణేందు చౌధురీ, మొహమ్మద్ అలీ, సంతోష్ రమేశ్ కుమార్ ఉన్నారు.

తొలి రౌండ్ లో 6-11, 7-11, 9-11 తేడాతో జశ్ మోదీపై స్నేహిత్ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో 9-11, 9-11, 6-11 తేడాతో రీగన్ చేతిపై మొహమ్మద్ అలీ ... మూడో రౌండ్ లో 12-10, 1-11, 9-11, 3-11 తేడాతో చిన్మయ సోమయ్యపై స్వర్ణేందు చౌధురీ పరాజయం చెందారు.
మరో సెమీస్ లో తమిళనాడు జట్టు కూడా 2-3 తేడాతో వెస్ట్ బంగాల్ చేతిలో ఓడిపోయి కాంస్యాన్ని దక్కించుకుంది. సరిపెట్టుకుంది. ఇక తుది పోరులో వెస్ట్ బంగాల్ 3-0 తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల ఈవెంట్ లోనూ పశ్చిమ బంగాల్ జట్టే పసిడిని ముద్దాడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications