ఫాతిమా, షమిత్‌లకు స్వర్ణాలు: గగన్ స్ఫూర్తి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆచంట షమిత్ (హైదరాబాద్) స్వర్ణపతకం కేవసం చేసుకున్నాడు. సోమవారం గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్‌లో ముగిసిన ఈ పోటీల్లో షమిత్ ప్రథమ స్థానంలో నిలువగా, సాయి అభినవ్ ద్వితీయ స్థానాల్లో నిలిచారు.
యువజన సర్వీసులు, క్రీడల ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ విజేతలకు పతకాలు అందించారు. ఉమ్మడి రాష్ట్ర పోటీల్లో దాదాపు 300 షూటర్లు పాల్గొన్నారు. పోటీల సందర్భంగా గగన్ నారంగ్ హాజరు యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
ఎన్ఆర్ఎఐకి చెందిన సీనియర్ అధికారులు లలిత్ చౌదరి, ఆచార్య తదితరులు పోటీల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

ఎయిర్ పిస్టల్ విజేతలు
ఎయిర్ పిస్టల్ మహిళా విభాగం విజేతలుగా నిలిచిన క్రీడాకారులు పతకాలతో ఇలా మెరిసిపోతూ కనిపించారు.

సెంటర్ ఫైర్ పిస్టల్
ఎయిర్ ఫైర్ పిస్టల్ పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఇలా పతకాలతో కనిపించారు.

స్కీట్ క్లే పీజన్
స్కీట్ క్లే పీజన్ షూటింగ్ పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచినవారు ఇలా కనిపించారు.

స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్
స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్ పురుషుల విభాగం విజేతలు ఇలా కనిపించారు. ఈ పోటీల సందర్భంగా గగన్ నారంగ్ రావడం యువతకు స్ఫూర్తినిచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications