ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్: తేజస్వినికి స్వర్ణం, చైన్‌కు రజతం

హైదరాబాద్: మునిచ్ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలిరోజే భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బుధవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో తేజస్విని సావంత్ బంగారు పతకం సాధించింది.
621.4 పాయింట్లతో తేజస్విని స్వర్ణం గెలుచుకోగా.. ఇదే విభాగంలో మరో భారత యువ షూటర్ అంజుమ్ మౌద్గిల్ 621.2 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకుంది. ఇక, పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో 627.9 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచిన చైన్ సింగ్ రజత పతకం గెలుచుకున్నాడు.
ఈ విభాగంలో అమెరికా షూటర్ మాథ్యూ ఎమ్మాన్స్ స్వర్ణ పతకం నెగ్గగా... గగన్‌నారంగ్ 32, సంజీవ్ రాజ్‌పుత్ 34వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ క్రీడలలోనూ తేజస్విని బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications