Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమెన్స్ ఇండియన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన అతిథి అశోక్

గురుగ్రామ్: ఇండియన్ గోల్ఫర్ అతిథి అశోక్ చరిత్ర సృష్టించింది. ఆదివారం నాడు గుర్గావ్‌లోని డీఎల్ఎఫ్, కంట్రీ క్లబ్‌లో జరిగిన గోల్ఫ్ పోటీలో ఆమె హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించింది. తద్వారా ఉమెన్స్ ఇండియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ గోల్ఫర్‌గా చరిత్ర సృష్టించింది.

శనివారం తొమ్మిదో స్ధానంలో ఉన్న అతిథి రెండో రోజైన ఆదివారం అనూహ్యంగా లీడ్‌లోకి వచ్చింది. హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్ టైటిల్‌‌ని సాధించిన అనంతరం అతిథి మీడియాతో మాట్లాడుతూ తాను తొమ్మిది గ్రీన్స్‌ని హిట్ చేయడం వల్ల తనకు అద్భుతంగా తొమ్మిది ఛాన్స్‌లు వచ్చాయని తెలిపారు.

అందులో తాను ఐదింటిని విజయవంతంగా ముగించానని పేర్కొంది. అదే తనకు కలిసొచ్చిందని తెలిపింది. మొదటి తొమ్మింటి వద్ద తాను ఇంకా ప్రదర్శన చేయాల్సి ఉన్నా, తొమ్మిదో హోల్ వద్ద తనకు డబులో బోజీ వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

Teen golfer Aditi Ashok wins Hero Women's Indian Open, creates history

మొదటి రెండు రోజులు కూడా తాను ఏవిధంగానైతే ఆడాలని భావించానో అదేవిధంగా రాణించానని తెలిపింది. దాంతో మరిన్ని ఛాన్స్‌లు ఆడేందుకు తనకు అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా తెలిపింది. రెండో స్ధానం కోసం స్పెయిన్‌కు చెందిన బీలీన్ మోజో, డెన్మార్క్‌కు చెందిన ఎమిలీ పెడర్సన్, ఆస్ట్రియాకు చెందిన క్రిస్టినే వోల్ఫ్‌ల మధ్య టై పడింది.

రెండో రౌండ్‌లో వీరందరికి 143 స్కోరు రావడం విశేషం. స్పెయిన్‌కు చెందిన బీలీన్ మోజోకు 4, 11, 17, 14 హోల్స్ వద్ద బోజీ లభించింది. ఒక్క రాత్రిలోనే లీడ్‌లోకి దూసుకొచ్చి టైటిల్ వేటలో నిలిచిన క్రిస్టినే వోల్ఫ్‌‌కు రెండు బిర్డీస్‌తో పాటు మూడు బోజీలు లభించాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+