Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమతూకమే పనికి వస్తుంది: సచిన్

Sachin Tendulkar
ముంబయి: యువకులు, సీనియర్ల సమతూకంతో క్రికెట్ జట్టు ఉండాలని, అప్పుడే భారత క్రికెట్ కు భవిష్యత్తు ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆస్ట్రేలియాలో సిబీ సిరీస్ విజయం తర్వాత ఢిల్లీలో గురువారం సన్మానం పొందిన ఆయన శుక్రవారం ముంబయి తిరిగి వచ్చారు. సీనియర్లు, జూనియర్ల సమతూకం వల్లనే ఆస్ట్రేలియాలో విజయం సాధ్యమైందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఇషాంత్, ప్రవీణ్ కుమార్ లు అద్భుతంగా రాణించారని ఆయన ప్రశంసించారు. ఇషాంత్ శర్మ సిరీస్ అంతా రాణించాడని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఫైనల్ సందర్భంగా ఇషాంత్ గాయపడడం దురదృష్టకరమని, ఇషాంత్ శర్మ నుంచి మరింత ఆశించవచ్చునని ఆయన అన్నారు. రెండో ఫైనల్ లో ప్రవీణ్ కుమార్ అద్భుతంగా రాణించాడని, ప్రవీణ్ కీలకమైన వికెట్లు తీశాడని, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే తీయడం భారత్ కు ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు.
Story first published: Friday, March 7, 2008, 16:28 [IST]
Other articles published on Mar 7, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+