
హైదరాబాద్: అయిదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనంద్ హవా మళ్లీ కొనసాగుతోంది, కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో నెంబర్ వన్ గా నిలిచిన ఆనంద్ మరో టైటిల్ సమరంలోనూ దాదాపు నెంబర్ వన్ స్థాయికి వచ్చేశాడు.
నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడో రౌండ్‌లో అమెరికాకు చెందిన ఫాబియానొ కరొనాను ఓడించి 2.5 పాయింట్లతో హాలెండ్‌కు చెందిన అనీష్ గిరితో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మూడు రోజుల్లో ఆనంద్‌కిది రెండో విజయం. ఇతర పోటీలలో మాస్టర్స్ విభాగంలో భారత ఆటగాడు అదిబన్ ఇంగ్లండ్‌కు చెందిన గవైన్ జోన్స్ చేతిలో ఓడిపోగా, ద్రోణవల్లి హారిక(1.5) నెదర్లాండ్స్‌కు చెందిన ఎర్విన్ లాఅమితో గేమ్‌ను డ్రాగా ముగించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.