మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ టెయిట్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి, భారత ఫ్యాషన్ రాంప్ మోడల్ మాషూమ్ సింఘాను టెయిట్ జూన్ 12వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక భారత్‌లోనే జరిగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, స్క్వాష్ క్రీడాకారుడు రిత్విక్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు.
ఐపీఎల్ వీరిద్దరి పరిచయానికి వేదికైంది. నాలుగేళ్ళుగా వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. ఇప్పుడు గత వారం పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ.. ఈ విషయాన్ని బయటకు కూడా చెప్పారు.

సమాచారం మేరకు... మషూమ్ మాట్లాడుతూ... పోయిన ఏడాది ఇద్దరు పారిస్‌లో ఉన్న సమయంలో టెయిడ్ పెళ్లి ప్రపోజల్ తీసుకు వచ్చాడని చెప్పింది. జూన్ 12వ తేదీన పెళ్లి ముంబైలో జరిగింది. ఈ పెళ్లికి ఆస్ట్రేలియా నుండి ముంబైకి పలువురు టెయిట్ స్నేహితులు వచ్చారట.