న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: చిక్కుల్లో మ‌నికా బాత్రా.. వేటు తప్పదా?

Table Tennis Federation Threatens Manika Batra For This Reason In Olympics

ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ 2020లో మూడో రౌండ్‌లో ఇంటిదారి పట్టిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ మ‌నికా బాత్రా చిక్కుల్లో ప‌డింది. విశ్వ క్రీడల మ్యాచ్‌ల సంద‌ర్భంగా నేష‌న‌ల్ కోచ్ సౌమ్య‌దీప్ రాయ్‌ని మ‌నికా బాత్రా నిరాక‌రించ‌డంపై టేబుల్ టెన్నిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా గుర్రుగా ఉంది. అంతేకాదు రాయ్‌ని మరో ప్లేయర్ సుతీర్థ ముఖ‌ర్జీ వ్య‌క్తిగ‌త కోచ్‌గా అభివ‌ర్ణించ‌డాన్ని ఫెడ‌రేష‌న్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అరుణ్‌ కుమార్ బెన‌ర్జీ త‌ప్పుబ‌ట్టారు. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత దీనిపై చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటారని సమాచారం తెలుస్తోంది.

సౌమ్య‌దీప్‌ రాయ్‌ని సుతీర్థ వ్య‌క్తిగ‌త కోచ్ అని అన‌డం ఏమాత్రం ప్రొఫెష‌న‌ల్ కాద‌ని, దీనిపై ఎలాంటి చ‌ర్య తీసుకోవాల‌ని ఆలోచిస్తామ‌ని అరుణ్‌ కుమార్ చెప్పారు. 'ఇది త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌. సౌమ్య‌దీప్ రాయ్‌ అకాడ‌మీలో సుతీర్థ ఆడుతుంది. కానీ సౌమ్య‌దీప్ ఓ నేష‌న‌ల్ కోచ్‌. త‌న‌తో పాటు కోచ్ అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం మ‌నికా బాత్రా చేసిన త‌ప్పు. మ‌నికా వ్య‌క్తిగ‌త కోచ్ కావాల‌ని అడిగింది. దానికి మేము కూడా స‌రే అన్నాం. కానీ టోక్యో వెళ్లిన త‌ర్వాత సౌమ్య‌దీప్ స్థానంలో త‌న కోచ్ కావాల‌ని అడ‌గడం స‌రికాదు' అని తాజాగా ఓ జాతీయ మీడియాతో అరుణ్‌ కుమార్ అన్నారు.

Tokyo Olympics 2021: లైవ్‌లోనే ప్లేయ‌ర్‌కు ప్ర‌పోజ్ చేసిన కోచ్‌.. ఏడ్చేసిన అందాల సుందరి (వీడియో)!Tokyo Olympics 2021: లైవ్‌లోనే ప్లేయ‌ర్‌కు ప్ర‌పోజ్ చేసిన కోచ్‌.. ఏడ్చేసిన అందాల సుందరి (వీడియో)!

'మ‌నికా బాత్రా మనసులో ఏముందో నాకు తెలియదు. ఆమెకు అన్ని ప్రమాణాలు తెలుసు. కార్యనిర్వాహక కమిటీతో దీనిపై చర్చిస్తాం. ఎలాంటి చ‌ర్య తీసుకోవాలో అప్పుడే నిర్ణ‌యం తీసుకుంటాం. మనికా ఇండియాకు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత చర్చిస్తాం' అని ఫెడ‌రేష‌న్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అరుణ్‌ కుమార్ బెన‌ర్జీ పేర్కొన్నారు. తన వ్యక్తిగత కోచ్ సంమయ్ పరంజాపే కోసం మైదానం (ఎఫ్ఓపి) యాక్సెస్‌ను అనుమతించాలని మణికా ఇంతకుముందు భారతదేశ చెఫ్-డి-మిషన్ బిపి బైశ్యాను అభ్యర్థించింది. చివరి నిమిషంలో ఎఫ్ఓపి మంజూరుకాకపోవడంతో ఆయన టోక్యో వెళ్లలేదు.

మణికా బాత్రా మూడో రౌండ్‌లో ఓడిపోయిన విషయం తెగెలిసిందే. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్- టేబుల్ 1పై సోమవారం జరిగిన ఈ రౌండ్‌లో మణికా వరుస సెట్లలో ఓటమి చవి చూసింది. 11-8, 11-2, 11-5, 11-7 స్కోర్ తేడాతో ఆస్ట్రియాకు చెందిన సోఫియా పోల్కనోవా చేతిలో పరాజయం పాలైంది. 27 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో తీవ్రంగా ప్రతిఘటించిన బాత్రా.. మలి సెట్లలో ఆ ఊపును కొనసాగించలేకపోయింది. ఏ దశలో కూడా తన ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. పెడ్లర్ సోఫియా పోల్కనోవా మ్యాచ్ అసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. .

Story first published: Tuesday, July 27, 2021, 17:56 [IST]
Other articles published on Jul 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X