For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జున అవార్డుకు మానిక, హర్మీత్‌ల పేర్లు ప్రతిపాదన

By Nageshwara Rao
Table Tennis: CWG stars Manika Batra, Harmeet Desai recommended for Arjuna Award

హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించిన చరిత్ర సృష్టించిన టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి మనిక బాత్రా, హర్మీత్‌ దేశాయ్‌ పేర్లను భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. ఈ మేరకు భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

'గోల్డ్‌కోస్ట్‌లో మానిక, హర్మీత్‌లు అద్భుత ప్రదర్శన చేశారు. అందుకే అర్జున అవార్డు కోసం వారి పేర్లను సూచించాం. గోల్డ్‌కోస్ట్‌లో మనిక అద్భుతమైన ప్రదర్శన చేసింది. రికార్డు స్థాయిలో నాలుగు పతకాలు సాధించింది. తుది ఎంపిక విషయంలో ప్రభుత్వ కమిటీకి మానిక పేరు విస్మరించడం చాలా కష్టం' అని అధికారి తెలిపారు.

ఆస్ట్రేలియాలో జరిగిన 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా మనిక చరిత్ర సృష్టించింది. సింగిల్స్‌, మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌తో పాటు టీమ్‌ విభాగంలోనూ గెలిచిన మానిక మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకుంది.

అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్‌లో 22 ఏళ్ల మానిక వరల్డ్ నంబర్ నాలుగో నంబర్‌ క్రీడాకారిణి ఫెంగ్‌పై రెండుసార్లు విజయం సాధించింది. సింగిల్స్‌, టీమ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం నెగ్గిన మానిక మహిళల డబుల్స్‌లో రజతం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, April 21, 2018, 11:43 [IST]
Other articles published on Apr 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+