
హైదరాబాద్: ప్రొ రెజ్లింగ్ లీగ్ సీజన్-3 మంగళవారం ఢిల్లీలో ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సుశీల్ కుమార్ ఇందులో పాల్గొననున్నాడు. ఇప్పుడు లీగ్‌లో అతనే ప్రధానాకర్షణ. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ సుల్తాన్స్, ముంబై మహారథి జట్లు తలపడతాయి. సుశీల్ (74కేజీ) ఢిల్లీ సుల్తాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాక్షి మాలిక్ ముంబై తరఫున బరిలోకి దిగనుంది.
ఇటీవల కామన్వెల్త్ క్రీడల సెలెక్షన్ ట్రయల్స్ సందర్భంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మద్దతుదారులు తనపై చేయిచేసుకోవడంపై సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణా తీవ్రంగా స్పందించాడు. సుశీలే స్వయంగా అతని మద్దతుదారులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని రాణా ఆరోపించాడు.
'సెమీస్ బౌట్ ముగిసిన వెంటనే సుశీల్ తన మద్దతుదారులను నాపైకి ఉసిగొల్పాడు. అతను (రాణా) ఇక్కడే ఉన్నాడు చూసుకోండి అని చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. దగ్గరుండి మరీ ఇలా చేయించడం దారుణం. ఆ రోజు దాడిలో నా సోదరుని తలపై కుర్చీతో దాడి చేశారు. అతనిప్పుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు' అని రాణా తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.