Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో ఇండియన్: ఖ‌లీ త‌ర్వాత డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈలోకి సుశీల్‌

హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. త్వరలోనే అతడు వ‌రల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో అడుగుపెట్ట‌ి తద్వారా ప్రొఫెష‌న‌ల్ రెజ్ల‌ర్‌గా మార‌నున్నాడు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా సుశీల్ కుమార్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

గత అక్టోబర్‌లో ప్రొఫెష‌న‌ల్ రెజ్లింగ్ ఆర్గ‌నైజేష‌న్స్ అయిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, టీఎన్ఏలు సుశీల్ కుమార్ పూర్తిస్థాయిలో చర్చలు జరిపాయి. ఈ రెండింటిలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూవైపే సుశీల్ కుమార్ తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. ఈ మేరకు సుశీల్ ఇప్ప‌టికే ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Sushil Kumar to make WWE debut by end of 2017: Reports

వచ్చే ఏడాది నవంబర్ లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్లలో సుశీల్ పాల్గొనే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే భార‌త్ నుంచి ద గ్రేట్ ఖ‌లీ త‌ర్వాత డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈలో అడుగుపెట్ట‌నున్న రెండో భార‌తీయుడిగా సుశీల్ కుమార్ నిల‌వ‌నున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండ‌న్ ఒలింపిక్స్‌లో రజత పతకాలను గెలిచాడు.

2016 రియో ఒలింపిక్స్‌కు కూడా గాయం కార‌ణంగా అత‌ను దూర‌మ‌య్యాడు. దీంతో 2017లో ప్రొఫెష‌న‌ల్ రెజ్లింగ్‌లో పాల్గొనాలనే ఆలోచనతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సంప్రదించాడు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ‌బ్ల్యూడబ్ల్యూఈకి మంచి క్రేజ్ కూడా ఉంది. ఇందులో సంపాద‌న కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రొఫెష‌న‌ల్ రెజ్లింగ్‌లో సుశీల్ ఎంత‌మేర‌కు రాణిస్తాడో చూడాలి.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+