Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్ వెల్త్ క్రీడలు: సురేష్ కల్మాడీపై వేటుకు కేంద్రం యోచన

Suresh Kalmadi
న్యూఢిల్లీ: కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కావటానికి ఇంకా పది రోజులు ఉండగానే వాటిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్రీడల చుట్టూ వివాదాలు, విషాదాలు చోటు చేసుకోవడంతో సురేష్ కల్మాడిని తప్పించే యోచనలో కేంద్రం ఉన్నట్టుంది. కల్మాడిని నియమించినప్పుడే అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్రం అంతగా పట్టించుకోలేదు. అయితే ఆయన కేంద్రం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశారు. దీంతో మొదట ఆయన్ను వద్దన్న వారి డిమాండ్ నెరవేరినట్టు అయ్యింది. ఆయితే ఇది అంతా అయన స్వయంకృపారాధమే.

టోర్కీకి ముందే పలు దేశాల క్రీడాకారులు అరకొర ఏర్పాట్లపై విమర్శలు చేశారు. క్రీడా గ్రామంలో వసతి ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉన్నాయని న్యూజిలాండ్, కెనడా, స్కాట్లాండ్, ఐర్లాండ్ తదితర దేశాలు ఎత్తి చూపాయి. ఏర్పాట్లపై కామన్ వెల్త్ సమాఖ్య అధ్యక్షుడు ఫెన్నెల్ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ పైకప్పు కూలడం, ఆ తర్వాత ఫూట్ ఓవర్ బ్రిడ్జి కూలటం ఇలా వరుసగా ఒకదాని వెనుక ఒకటి సంఘటనలు చోటు చేసుకోవటంతో కేంద్రం కల్మాడి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా క్రీడల ప్రారంభానికి కొన్ని రోజుల ముందే ఢిల్లీలో ఉగ్రవాద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

అమెరికా సైతం గురువారం కామన్ వెల్త్ పై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని బాంబు పేల్చింది. దీంతో ఇప్పటికే పలు వివాదాలు, విషాదాలతో నిండిపోయిన కామన్ వెల్త్ కు మరింత భయం పట్టుకుంది. క్రీడలకు సంబంధించి అన్నింటిలోను కల్మాడీ విఫలం అవుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి కూడా మరో వైఫల్యం కాకూడదని అందుకు ఆయన్ను తప్పించడమే మార్గంగా కేంద్రం యోచిస్తుంది. కేంద్రం ఆధ్వర్యంలోనే క్రీడలు జరిగే అవకాశముంది.

ఉగ్రవాదం పేరు చెప్పటంతోనే ఇంగ్లాండ్ అథ్లెట్లు భారత్ కు రామని చెప్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాలు ఢిల్లీ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చైనా దేశం బీజింగ్ లో నిర్వహించిన కామన్ వెల్త్ భారీ ఎత్తున, ఎలాంటి సమస్యలు, వివాదాలు లేకుండా జరిగాయి. సౌకర్యాలపై కూడా అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. వేల కోట్లు ఖర్చు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా నిర్వహించారు. కాని భారత్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్దంగా ఉండటం బాధారకం.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+