Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపియల్ తో మాకేం సంబంధం లేదు: సుప్రియ

Supriya Sule
న్యూఢిల్లీ: ఏ ఐపియల్ ఫ్రాంచైజీతోనూ తమ కుటుంబ సభ్యలకు సంబంధాలు లేవని కేంద్ర మంత్రి శరద్ పవార్ కూతురు, ఎన్సీపి పార్లమెంటు సభ్యురాలు సుప్రీయా సూలే స్పష్టం చేశారు. ఐపియల్ జట్టు కోసం ఓ పారిశ్రామిక సంస్థతో కలిసి బిడ్ వేసి శరద్ పవార్ అల్లుడు విఫలమైనట్లు వచ్చిన వార్తలపై ఆమె మంగళవారం స్పందించారు. తన భర్త సదానంద్ సూలేకు గానీ తన కుటుంబ సభ్యులకు గానీ ఐపియల్ సంబంధాలు లేవని నమ్మకంగా చెప్పగలనని, వాటికి తాము మైళ్ల దూరం ఉంటామని, తన భర్త, పిల్లలు, తన కుటుంబ సభ్యులు క్రికెట్ ను అభిమానంతో చూస్తారని, దాంతోనే తాము ఆగిపోతామని ఆమె వివరించారు.

ప్రజలు ఏమంటున్నారు, ఏం ప్రచారం చేస్తున్నారనేది ముఖ్యం కాదని, తాము ఎలా ఉన్నామనేది తమకు తెలుసునని ఆమె అన్నారు. శశి థరూర్, లలిత్ మోడీ వ్యవహారంలో కూడా తన తండ్రి శరద్ పవార్ తటస్థంగా ఉన్నారని ఆమె చెప్పారు. శరద్ పవార్ శశి థరూర్ గురించి చాలా బాగా మాట్లాడారని, లలిత్ మోడీని వెనకేసుకొచ్చారనే మాటలో నిజం లేదని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ వీడియో కాన్ కోసం లాబీయింగ్ చేశారని వార్తలను కూడా ఆమె ఖండించారు. ప్రఫుల్ భాయ్ గురించి అందరికీ తెలుసునని, సానుకూలమైన ఎంపిల్లో, మంత్రులో ప్రఫుల్ ఒకరని, ప్రఫుల్ ను దేశమంతా అభిమానిస్తుందని ఆమె అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+