హైదరాబాద్: ప్రీమియర్ ఫుట్సల్ ఫ్రాంచైజీ బ్రాండ్ అంబాసిడర్, సహ యజమానిగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ నియామకమైంది. అంతేకాదు కోచికి చెందిన కేరళ కోబ్రాస్ జట్టుకు సన్నీలియోన్ సహ యజమానిగా కూడా వ్యవహరించనుంది.
ప్రీమియర్ ఫుట్సల్ రెండో సీజన్ సెప్టెంబర్ 15 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17వరకు వర్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌సీఐ)లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక రెండో రౌండ్ మ్యాచ్‌లకు సెప్టెంబర్ 19 నుంచి 24 వరకు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

సెమీఫైనల్స్ దుబాయ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్నట్లు ప్రీమియర్ ఫుట్సల్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.