Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరీక్షలకు హాజరైన నరేన్, మంచి బౌలింగ్‌తో తిరిగి వస్తాడు: రాబిన్ ఊతప్ప

కోల్‌కత్తా: బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని పరీక్షలో తేలడంతో ఐపీఎల్‌లో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన సునీల్ నరేన్ మంచి బౌలింగ్‌తో తిరిగి వస్తాడని కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు.

బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని తేలడంతో సునీల్ నరేన్‌ని ఆఫ్ స్పిన్ వేయొద్దంటూ బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తోన్న బౌలర్‌‌కు ఇలాంటి పరిస్ధితి రావడం బాధాకరమన్నాడు.

సునీల్ నరేన్ మంచి నైపుణ్యం కలిగిన బౌలర్ అని ప్రశంసించాడు. జట్టుకు అతని వల్ల ఎంతో ఉపయోగమని అన్నారు. అతడిని తప్పకుండా మిస్ అవుతున్నామని చెప్పిన ఊతప్ప, బౌలింగ్‌ యాక్షన్‌ని మెరుగుపరుచుకుని తొందరలోనే తిరిగి మ్యాచ్‌లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sunil Narine will return stronger: Robin Uthappa

2012, 2014 ఐపీఎల్ టైటిల్ ఛాంపియన్‌గా కోల్‌కత్తా జట్టు నిలవడంలో సునీల్ నరేన్ కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ నిషేధం తర్వాత చెన్నైలో తాజాగా బౌలింగ్ పరీక్షకు సునీల్ నరేన్ హాజరయ్యాడు. స్ధానిక శ్రీరామచంద్ర ఆర్ధోస్కోపి కేంద్రంలో నరేన్ సవరించిన బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించుకున్నాడు.

ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున సునీల్ నరేన్ ఆడుతున్న విషయం తెలిసిందే. తుది జట్టులో సునీల్ నరేన్ స్ధానంలో 41 ఏళ్ల బ్రాడ్ హాగ్‌ గత రెండు మ్యాచ్‌లుగా ఆడిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో బ్రాడ్ హాగ్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక గురువారం కోల్‌కత్తాలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గంభీర్ నేతృత్వంలోని కోల్‌కత్తా 7 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+