
ముంబై: ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం చైనా ఖాతాలో చేరింది. ఆ దేశానికి చెందిన అథ్లెట్ సన్ పీయూన్ ఉషులో పసిడి గెలిచాడు. గత ఆసియా క్రీడల్లో 151 బంగారు పతకాలు సాధించిన చైనా ఈ సారి మరిన్ని ఎక్కువ పతకాలను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. పోటీల తొలి రోజు చైనా 7 స్వర్ణాలను గెలుచుకోవడం విశేషం. మొత్తం 16 పతకాలు సాధించిన చైనా యథావిధిగా అగ్రస్థానంలోనే నిలిచింది.
తొలి రోజు భారత్ ఖాతాలో మొదటి స్వర్ణం నమోదైంది. రెజ్లర్ భజరంగ్ పూనియా పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్ 11-8తో టకాటని డైచి (జపాన్)ని ఓడించాడు. రక్షణాత్మకంగా ఆడిన భజరంగ్ సాంకేతికంగా మరో పాయింట్ గెలిచి 11-8తో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతేగాక నాలుగేళ్ల తర్వాత భారత్‌కు స్వర్ణం దక్కించాడు భజరంగ్.
ఆసియా గేమ్స్‌లో సోమవారం భారత్ షెడ్యూల్:
(ఉ. 8); హాకీ: పురుషుల పూల్ మ్యాచ్ - భారత్..ఇండోనేసియా
(రా. 7); కబడ్డీ: మహిళల పూల్ మ్యాచ్ - భారత్.. థాయ్‌లాండ్
(ఉ. 8.30), పురుషుల పూల్ మ్యాచ్ - భారత్..దక్షిణ కొరియా
(మ. 3); షూటింగ్: మహిళల ట్రాప్ -శ్రేయాసి సింగ్, సీమా తోమర్
(ఉ. 7), పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్- రవికుమార్, దీపక్ కుమార్
(ఉ. 6.30), పురుషుల ట్రాప్ -మానవ్‌జిత్, మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్- ఎలవెనిల్, అపూర్వి చండీలా
(ఉ. 8.30); స్విమ్మింగ్: అద్వైత్, శ్రీహరి, అరవింద్, నీల్ రాయ్
(ఉ. 7.30); టెన్నిస్
(ఉ. 9 నుంచి): పురుషుల సింగిల్స్ - ప్రజ్నేశ్, రామ్‌కుమార్,
పురుషుల డబుల్స్ - బోపన్న/దివిజ్, సుమిత్/రామ్‌కుమార్,
మహిళల సింగిల్స్ - అంకితా రైనా, కర్మాన్ కౌర్,
మహిళల డబుల్స్ - అంకిత/ప్రార్థన,
మిక్స్‌డ్ డబుల్స్- బోపన్న/ప్రార్థన; రెజ్లింగ్
(మ. 12 నుంచి): వినేశ్ ఫొగట్ (50 కి), పింకీ (53 కి), పూజా ధండా (57 కి), సాక్షి మాలిక్ (62 కి).