సుదిర్మన్ కప్: సింధు విజయంతో నాకౌట్ అవకాశాలు సజీవం
హైదరాబాద్: సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండో రోజు సత్తా చాటింది. నాకౌట్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటుకుంది. సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్రూప్-డి మ్యాచ్‌లో భారత్ 4-1తో ఇండోనేసియాను ఓడించింది.
తొలి మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో ఓడినప్పటికీ భారత్ కోలుకుంది. మంగళవారం మిక్స్‌డ్ డబుల్స్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప- సాత్విక్ సాయిరాజ్ జోడీ 22-20, 17-21, 21-19తో తొలి విజయాన్ని అందించింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-15, 21-16తో జొనాథన్ క్రిస్టీపై గెలవడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

సింధు విజయంతో నాకౌట్ అవకాశాలు సజీవం
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 9-21, 17-21తో మార్కస్ గిడియోన్-కెవిన్ సంజయ జంట చేతిలో ఓడింది. దీంతో భారత్ ఆధిక్యం 2-1కి చేరింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు 21-8, 21-19తో ఫిత్రియానిపై నెగ్గడంతో భారత్ 3-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.

గ్రూప్-డిలో భారత్, డెన్మార్క్ ఒక్కో విజయంతో సమంగా
నామమాత్రమైన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 21-12, 21-19తో డెల్లా డెస్తియారా-రొసియాతా జోడీపై నెగ్గడంతో భారత్ 4-1తో గెలుపొందింది. దీంతో గ్రూప్-డిలో ప్రస్తుతం భారత్, డెన్మార్క్ ఒక్కో విజయంతో సమంగా ఉన్నాయి.

నాకౌట్ బెర్త్ ఎవరిదో
దీంతో నాకౌట్ బెర్త్ ఎవరిదో ఖరారు కావాలంటే డెన్మార్క్, ఇండోనేసియా జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ వరకూ వేచిచూడాల్సిందే. బుధవారం మ్యాచ్‌లో డెన్మార్ నెగ్గితే దానితోపాటు భారత్ కూడా నాకౌట్ చేరుతుంది. ఒకవేళ ఇండోనేసియా విజయం సాధిస్తే ఈ గ్రూప్‌లోని మూడు జట్లు ఒక్కో విజయంతో సమానంగా నిలుస్తాయి.

తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు
ఈ నేపథ్యంలో మెరుగైన గేమ్‌లు, పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుతాయి. ఈ టోర్నీలో భారత్ చివరిసారిగా 2011లో నాకౌట్‌కు చేరింది. ఆ తర్వాత జరిగిన రెండు సార్లు గ్రూప్ దశను దాటలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications