Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా ఫ్యాన్: ముద్దు పెట్టుకోబోయి టీవీ బద్దలు కొట్టాడు

రియో డి జెనీరో: బ్రెజిల్ సాకర్ వీరాభిమాని రాఫెల్ గాంబారిమ్ ఒత్తిడిలో టీవీ పగులగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో షేర్ జోరుగా అవుతోంది. చిలీ, బ్రెజిల్ జట్ల మధ్య జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు సమవుజ్జీగా నిలవడంతో 30 నిమిషాల ఎక్‌స్ట్రా టైమ్‌ను ప్రకటించారు.

అందులోనూ ఫలితం తేలకపోవడంతో మెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించారు. షూటౌట్ కూడా పోటాపోటీగా సాగింది. ఒక దశలో బ్రెజిల్, చిలీ జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. ఆ సమయంలో సర్వత్రా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. టీవీలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న గాంబారిమ్ క్షణక్షణం పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు.

Stressed Brazil fan smashes TV, video goes viral

అలెక్సీస్ సాంచెజ్ కొట్టిన పెనాల్టీని బ్రెజిల్ గోల్ కీపర్ జూలియో సీజర్ అడ్డుకోవడంతో గాంబారిమ్ కేరింతలు కొట్టాడు. టీవీపై కనిపిస్తున్న జూలీయోను ముద్దాడేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో స్క్రీన్‌పై సాంచెజ్ ప్రత్యక్షం కావడంతో కోపంతో ఊగిపోయాడు.

18వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు డేవిడ్ లూయిజ్ గోల్ చేస్తే, 32వ నిమిషంలో సాంచెజ్ ఈక్వెలైజర్‌ను సాధించడమే అతని కోపానికి కారణమైంది. సాంచెజ్ ముఖం కేవలం టీవీలో మాత్రమే కనిపిస్తున్నదనే విషయాన్ని కూడా మరచిపోయిన అతను బలంగా చేత్తో బలంగా కొట్టడంతో టీవీ స్క్రీన్ ధ్వంసమైంది.

ఈ దృశ్యం సామాజిక వెబ్ సైట్లు ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లోన సందడి చేస్తోంది.ఇప్పటికే ఫేస్ బుక్‌లో 34,000, యూ ట్యూబ్‌లో 36,000 హిట్స్ వచ్చాయి. సాంచెజ్‌పై కోపం టీవీపై చూపి, దానిని ధ్వంసం చేసినప్పటికీ గాంబారిమ్‌కు గొప్ప ప్రచారమే లభించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+