For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 6 6 6: మైదానంలో ఏడ్చిన బెన్ స్టోక్స్, ట్విట్టర్‌లో స్పందన

By Nageswara Rao

కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20 ఛాంపియన్‌గా నిలవాలంటే వెస్టిండిస్ జట్టు చివరి ఓవర్‌లో అంటే 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది. అందరిలో ఉత్కంఠ. చివరి ఓవర్ ఎవరు వేస్తారో, ఇంగ్లాండ్ కెప్టెన్ చివరి ఓవర్ వేసే అవకాశాన్ని ఎవరికిస్తారో అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో టోర్నీలో మెరుగ్గా బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్ జట్టుకు విజయాలను అందించిన బెన్ స్టోక్స్‌కు ఫైనల్ ఓవర్ వేసే అవకాశాన్ని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌లో తన మ్యాజిక్‌ను చూపలేకపోయాడు. చివరి ఓవర్‌లో నెలకొన్న ఉత్కంఠను వెస్టిండిస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ తొలి నాలుగు బంతుల్లోనే జయించి, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు సగటు క్రికెట్ అభిమాని కలలో కూడా ఉహించని ముగింపు ఇచ్చాడు.

కార్లోస్ బ్రాత్ వైట్ వరుసగా 6, 6, 6, 6 సిక్సులు కొట్టాడు. దీంతో వెస్టిండిస్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. వెస్టిండిస్ ఆటగాళ్లు ఒక్కసారిగా మైదానంలో ఆనంద పారవశ్యంలో సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు చివరి ఓవర్ వేసి ఊహించని రీతిలో పరుగులిచ్చిన బెన్ స్టోక్స్ మాత్రం షాక్‌కు గురయ్యాడు.

Stokes is devastated, will take couple of days to heal: Morgan after loss in World T20 final

మైదానంలో అక్కడే కూర్చొని కన్నీటి పర్యంతమయ్యాడు. తీవ్ర విషాదంలో ముగిగిపోయాడు. బెన్ స్టోక్స్ పరిస్థితిని చూసిన ప్రతిఒక్కరికీ బాధేసింది. అయితే మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. చివరి ఓవర్‌లో క్రికెట్ అభిమానులను నిరాశ పరిచానని అన్నాడు. దేశం తరుపున ఆడటం ఎంతో గర్వంగా ఉందన్నాడు.

మైదానంలో ఇంగ్లాండ్ జట్టుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వరల్డ్ టీ20 ఛాంపియన్‌గా అవతరించిన వెస్టిండిస్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే ఆటలో గెలుపు ఓటములు సర్వసాధారణం. దీనిపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. 'ఇది సహజం. అతను పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాడు. ఈ ప్రభావం అతనిపై కొన్ని రోజులు ఉంటుంది. అతడి బాధను మేము కూడా పంచుకుంటున్నాం. అతని ఓదార్చి ఉండవచ్చని మీరు చెప్పవచ్చు. కానీ అది వినే స్థితిలో కూడా అతడు లేడు' అని అన్నాడు.

క్రికెట్ అనేది అత్యంత క్రూరమైన ఆట అని, ఒకానొక దశలో విండీస్‌ జట్టును కట్టడి చేసినట్టు తాము భావించినప్పటికీ చివరికి వచ్చేసరికి ఊహించనిరీతిలో ఆ జట్టు విజయం సాధించిందని, క్రికెట్‌లో ఏదైనా జరుగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాడు. ఫైనల్‌లో పరాయజానికి బెన్‌ స్టోక్‌ను నిందించరాదని, ఫైనల్‌ వరకు తమ జట్టు వచ్చినందుకు తాను గర్విస్తున్నానని, తన జట్టు ఆటతీరు పట్ల కూడా తనకు గర్వంగా ఉందని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+