Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ అథ్లెట్‌కు షాకిచ్చిన నాడా.. రెండేళ్ల పాటు నిషేధం?

భారత స్ప్రింటర్ హిమా దాస్‌కు నాడా షాకిచ్చింది. గడిచిన 12 నెలల్లో మూడుసార్లు డోపింగ్ పరీక్షలు మిస్ అయిన కారణంగా తాత్కాలికంగా ఆమెపై నిషేధం విధించింది. ఈ మేరకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అస్సాంకు చెందిన 23 ఏళ్ల హిమా దాస్.. చైనాలోని హాంగ్‌జోలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదని తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో ఆమె గాయపడటంతో ఈ టోర్నీకి దూరమైంది.

ఈ క్రమంలో సడెన్‌గా ఆమెపై ఇలా నిషేధం విధించినట్లు వార్తలు రావడంతో క్రీడాలోకం షాకైంది. దీని గురించి భారత బృందంలోని అధికారి మాట్లాడుతూ.. 'ఏడాది కాలంలో మూడుసార్లు డోపింగ్ పరీక్షలు మిస్ అయింది. ఈ వేరబౌట్ ఫెయిల్యూర్ కారణంగా ఆమెపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది' అని చెప్పారు. ఇప్పటికే నేషనల్ క్యాంప్ వీడిన హిమా.. ఈ తప్పిదం ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది.

Star Sprinter Hima Das suspended by NADA for failing wherabout test

ఆమె ఇచ్చే వివరణ సబబుగా ఉందని నాడా భావిస్తే.. ఈ నిషేధాన్ని ఏడాదికి తగ్గిస్తుంది. లేదంటే రెండేళ్లపాటు ఈ నిషేధం కొనసాగుతుంది. దేశంలోని అత్యుత్తమ స్ప్రింటర్లలో ఒకరైన హిమా దాస్.. 2018 ఆసియా క్రీడల్లో 400 మీటర్ల రేస్‌లో సిల్వర్ మెడల్ గెలిచింది. అదే టోర్నీలో స్వర్ణం గెలిచిన 4x400 మీటర్ల మహిళల జట్టుల హిమా కూడా ఉంది. అలాగే రజతం గెలిచిన మిక్స్‌డ్ విభాగం టీంలో కూడా హిమా ఉండటం గమనార్హం.

ప్రపంచ అథ్లెటిక్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధనల ప్రకారం, ఏడాది కాలంలో మూడుసార్లు తమ వివరాలు ఫైలింగ్ చేయకపోయినా, ఏవైనా టెస్టులు మిస్ అయినా ఆ క్రీడాకారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిమా తన వివరాలు ఫైలింగ్ చేయలేదా? లేక ఏవైనా టెస్టులు మిస్ అయిందా? అనేది ఇంకా తెలియరాలేదు. రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)లో ఉన్న ప్లేయర్లు ఎక్కడైనా ఓవర్‌నైట్ స్టే చేస్తుంటే ఆ అడ్రస్ కూడా అధికారులకు చెప్పాల్సి ఉంటుంది.

అలాగే తాము ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నది? పని చేస్తుంది? రెగ్యులర్‌గా వెళ్లే ఏ చోటు ఉన్నా.. ఆ అడ్రసులతోపాటు అక్కడ ఎంత సేపు ఉంటామనే వివరాలు కూడా అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆర్‌టీపీ క్రీడాకారులు మరో రూల్ కూడా పాటించాలి. అదేంటంటే.. ప్రతిరోజూ తమకు వీలైనప్పుడు ఒక గంటపాటు దగ్గరలోని ఆఫీసులో టెస్టులు తీసుకోవాలి. ఒకవేళ ఇవి మిస్ అయినా కూడా వేరబౌట్ ఫెయిల్యూర్ కిందనే నమోదవుతుంది.

Story first published: Wednesday, September 6, 2023, 9:30 [IST]
Other articles published on Sep 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+