Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకపై భారత్ సిరీస్ ఓటమి

కొలంబో: శ్రీలంకపై కొలంబోలో జరిగిన మూడో క్రికెట్ టెస్టు మ్యాచులో భారత్ సోమవారం ఘోరంగా ఓడిపోయింది. శ్రీలంక మూడో టెస్టును 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. 122 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను శ్రీలంక 2-1 స్కోరుతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ మొత్తంలో భారత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించగా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో వర్ణపుర 54 పరుగులు, మహీలా జయవర్ధనే 50 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలారు. అంతకు ముందు శ్రీలంక బ్యాట్స్ మెన్ లో శ్రీలంక ఓపెనర్ వండోర్ట్ ను 8 పరుగులకే హర్భజన్ అవుట్ చేశాడు. సంగక్కర 4 పరుగులు చేసి జహీర్ ఖాన్ బౌలింగులో గంభీర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్సులో 249, రెండో ఇన్నింగ్సులో 268 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్సులో 396 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 123 పరుగులు చేసింది.

Story first published: Monday, August 11, 2008, 18:34 [IST]
Other articles published on Aug 11, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+