For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాన్నకు కారు కొంటా: ఐపియల్ క్రికెట్ బుడతడు సర్ఫరాజ్

By Pratap

విశాఖపట్నం/ రోహతక్: ఐపీఎల్‌-8 వేలంలో రూ.50 లక్షలు దక్కించుకున్న 17 ఏళ్ల ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తాననే విషయంపై తన మనోగతాన్ని చెప్పాడు. అతడిని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ డబ్బుతో ముందుగా తన తండ్రి నౌషద్‌కు కారును బహుమతిగా అందించనున్నట్టు తెలిపాడు.

ఇన్నాళ్లకు ఆ కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని వెస్ట్‌జోన్‌ తరపున అండర్‌-19 మ్యాచ్‌ ఆడడానికి విశాఖపట్నం వచ్చిన సర్ఫరాజ్‌ చెప్పాడు. ఐపిఎల్‌లో వేలానికి వచ్చి అంత ఎక్కువ ధరకు అమ్ముడైన అతి చిన్న వయస్కుడు సర్ఫరాజ్ ఖాన్

Sradraj Khan to buy car to his father

మహారాష్ట్ర, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ ఆసక్తికరంగా మారింది. ఓవర్‌నైట్‌ స్కోరు 87/3తో రెండో రోజు బరిలోకి దిగిన ఆంధ్ర అనుపమ్‌ (4/45) ధాటికి 138 పరుగులకే ఆలౌటైంది. ఉదయం తొలి గంటలో పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో తొలి రోజులాగే రెండో రోజు కూడా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న మహారాష్ట్ర బౌలర్‌ సమద్‌ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శివ కుమార్‌ (3/54), స్టీఫెన్‌ (2/31) రాణించారు. ఇప్పటికి మహారాష్ట్ర 125 పరుగుల ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

కర్ణాటక భారీ స్కోరు

అసోంతో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/2తో బరిలోకి దిగిన కర్ణాటక రెండో రోజు మరో 150 పరుగులు జోడించింది. రాబిన్‌ ఊతప్ప (153) భారీ శతకం, కేఎల్‌ రాహుల్‌ (91) హాఫ్‌ సెంచరీ సాధించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+