ఆఖరి పరుగుకు చేరువలో, ఇక ముగిస్తా: ఉసేన్ బోల్ట్ ఉద్వేగం
హైదరాబాద్: జమైకా స్ప్రింట్ స్టార్ ఉసేన్ బోల్ట్ కెరీర్ ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో బోల్ట్ తన చివరి పరుగుకు సిద్ధమయ్యాడు. తన పరుగుతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్ తనకు ఇదే చివరి సీజన్ కావొచ్చని చెప్పాడు.
వచ్చే సీజన్‌లో కూడా పరుగు కొనసాగిస్తారా? అని అడిగినప్పుడు 'లేదు. కొనసాగించకపోవచ్చు' అని సమాధానమిచ్చాడు. 'నా కెరీర్ ఎంతో గొప్పగా సాగింది. ఎత్తుపల్లాలను ఆస్వాదించా. నేను కోరుకున్న ప్రతి ఒక్కటీ చేశా. నా కెరీర్ ముగింపునకు వచ్చేసింది. దాన్ని నేను అంగీకరిస్తున్నా' అని బోల్ట్ చెప్పాడు.

భావోద్వేగంతో ఉసేన్ బోల్ట్
బుధవారం ఓస్ట్రావాలోని చెక్ సిటీలో ఐఏఏఎఫ్ ప్రపంచ ఛాలెంజ్ మీట్ నేపథ్యంలో బోల్ట్ మీడియాతో మాట్లాడాడు. ఈ సీజన్ తనకు భావోద్వేగంతో కూడుకున్నదని బోల్ట్ చెప్పాడు. ఈ మీట్ తర్వాత అతడు జులైలో డైమండ్ లీగ్ మీట్ (మొనాకో), లండన్‌లో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనున్నాడు.

ఇది నాకు ఉద్వేగభరిత సీజన్
'ఇది నాకు ఉద్వేగభరిత సీజన్. అక్కడ నేను చివరిసారి అభిమానులను అలరించాలనుకుంటున్నా. ఇప్పటికైతే నా దృష్టంతా సీజన్‌పైనే. ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించడానికి ప్రయత్నిస్తా' అని బోల్ట్ పేర్కొన్నాడు. కాగా, లండన్‌లో 200మీ పందెంలో తాను పరుగెత్తనని అతడు స్పష్టం చేశాడు.

ఈ ఏడాది స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపిక
ఇదిలా ఉంటే 2017 సంవత్సరానికి గాను స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఉసేన్ బోల్ట్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. గతంలో 2009, 2010, 2013లో బోల్ట్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఒలింపిక్స్‌లో 'ట్రిపుల్ ట్రిపుల్'తో చరిత్ర సృష్టించిన ఉసేన్ బోల్ట్ రికార్డు చెదిరిన సంగతి తెలిసిందే.

తొమ్మిది స్వర్ణాల్లో ఒకటి వెనక్కి
ఉసేన్ బోల్ట్ గెలిచిన తొమ్మిది స్వర్ణాల్లో ఒకటి వెనక్కి తీసుకున్నారు. దీంతో ఉసేన్ ఒలింపిక్ స్వర్ణాల సంఖ్య తొమ్మిది నుంచి ఎనిమిదికి తగ్గింది. 2008 బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బోల్ట్‌తో కలిసి 4X100 మీటర్ల రిలే రేసు బరిలోకి దిగిన జమైకా బృందంలోని అథ్లెట్ నెస్టా కార్టర్ డోపింగ్‌లో దొరికిపోయాడు. వాడా నిషేధిత జాబితాలో ఉన్న మిథైల్‌ఎక్సామైన్‌ను కార్టర్ తీసుకున్నట్లు కొత్త టెక్నాలజీతో జరిపిన పరీక్షల్లో బయటపడిందని ఐఓసీ ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications