
ఓ ప్రమోషనల్ ఈవెంట్ కోసం
ఓ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌లో గురుత్వాకర్షణ శక్తి ఏ మాత్రం లేకుండా ప్రత్యేకంగా కల్పించిన పరిస్థితుల్లోనూ, షాంపెయిన్ తాగి మరీ రేస్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ రేస్‌లో ఉసేన్ బోల్ట్‌తో పాటు ఫ్రెంచ్ వ్యోమగామి జీన్ ఫ్రాంకోయిస్, నోవెస్పేస్ సీఈఓ ఆక్టేవ్ డి గల్లె పరుగులు తీశారు.

జీరో గ్రావిటీ పరిస్థితుతుల్లో కూడా
పరుగెత్తడానికి అసలేమాత్రం అనుకూలించని జీరో గ్రావిటీ పరిస్థితుతుల్లో గాల్లో ఈదుకుంటూ రేస్‌లో విజేతగా నిలిచాడు జీరో స్పేస్ సాంకేతికత తెలిసిన వారిపై అదే వాతావరణంలో సరదాగా జరిగిన రేస్‌లో గెలిచి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎయిర్‌బస్ జీరో జీలో
జీరో గ్రావిటీతో ప్రత్యేకంగా తయారైన ఎయిర్‌బస్ జీరో జీలో ఓ ప్రమోషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం బోల్ట్ తన స్టైల్లో షాంపైన్ బాటిల్‌తో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఈ బాటిల్‌ను స్పేస్ టూరిజం పెంపొందించడానికి, వ్యోమగాముల కోసం ప్రత్యేంగా తయారు చేసినది కావడం విశేషం.
ఈ అనుభూతి చాలా కొత్తగా అనిపించింది
దీనిపై బోల్ట్ మాట్లాడుతూ "తొలుత కొద్దిగా నీరసంగా అనిపించినప్పటికీ, ఆ తర్వాత ఈ అనుభూతి చాలా కొత్తగా అనిపించింది" అని అన్నాడు. తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బోల్ట్.. 2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్ అనంతరం అథ్లెటిక్స్ నుంచి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












