Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత మీడియాను ఆడిపోసుకున్న క్లార్క్, ఫిక్సింగ్ ఆరోపణలు ప్రచారమే

Stuart Clark
మెల్బోర్న్: ఎల్వీస్ ప్రెస్లీతో జార్జి బుష్, ఒసామా బిన్ లాడెన్ విందు చేయడానికి అవకాశాలు ఉండవచ్చు గానీ తమ జట్టు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడడానికి అవకాశాలు లేవని ఆస్ట్రేలియా పేసర్ స్టార్ట్ క్లార్క్ అన్నారు. ప్రపంచ కప్ పోటీల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి భారత మీడియానే అటువంటి ప్రచారం సాగించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను తాను నమ్మలేకపోయానని ఆయన అన్నారు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ రాసిన కాలమ్‌లో ఆయన ఆ విధంగా అన్నారు.

జింబాబ్వేతో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా మందకొడి బ్యాటింగ్‌పై ఐసిసి విచారణ చేపట్టిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తామేమీ మాట్లాబోమని చెప్పడం ద్వారా ఐసిసి అగ్నికి ఆజ్యం పోసిందని, దాంతో ఊహాగానాలు ఊపందకున్నాయని క్లార్క్ అన్నారు. ఆస్ట్రేలియా జట్టు మేనేజర్ స్టీవ్ బెర్నార్డ్ ముందుకు వచ్చి ఆ ఆరోపణలను కొట్టి పారేయడం సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+