Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిన్నారి వైద్యం కోసం ఒలింపిక్ కాంస్య పతకం త్యాగం

Zofia Noceti-Klepacka
పోలండ్, ఆగస్టు 15: లండన్ ఒలింపిక్స్‌లో మహిళల ఆర్ ఎస్-ఎక్స్ సెయిలింగ్ విభాగంలో పోలెండ్‌కు చెందిన క్రీడాకారిణి నోసెటి క్లెపాకా కాంస్య పతకం గెలుచుకుంది. ఐతే ఇప్పుడు ఆ కాంస్య పతకాన్ని వేలం వేయడానికి సిద్దపడింది. ఇంతకీ నోసెటి క్లెపాకా ఏమి కష్టం వచ్చింది.. ఎందుకు ఆ కాంస్య పతకాన్ని వేలం వేస్తుందని అనుకుంటున్నారా..?

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలిక వైద్యం నిమిత్తం తన కాంస్య పతకాన్ని వేలం వేయనుంది. ఆమె పక్కింట్లో నివసించే ఐదేళ్ల జుజియా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ప్రమాదకర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. ఈ పాపకు నిరంతర వైద్యం లేకపోతే ప్రాణానికే ప్రమాదం. అయితే కుటుంబసభ్యుల పేదరికంతో చిన్నారికి వైద్యం అందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పతకం గెలిస్తే, దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బుతో వైద్యం చేయిస్తానని తన అభిమాని అయిన జుజియాకు ఒలింపిక్స్ వెళ్లడానికి ముందే మాటిచ్చింది.

తన అభిమానికి మాట ఇచ్చిన విధంగా ఆమె మహిళల ఆర్ ఎస్-ఎక్స్ సెయిలింగ్ విభాగంలో కాంస్యం సాధించింది. దాన్ని వేలానికి పెట్టాలనే నిర్ణయం తీసుకుని అన్న మాటపై నిలబడడమే కాకుండా.. క్రీడా చరిత్రలో గొప్ప క్రీడాకారిణి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో పాటు మంచి మనసున్న మనిషిగా అందరి మన్ననలు అందుకుంటోంది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+