
ఈ సందర్బంలో శోధి మాట్లాడుతూ ఒలింపిక్ పతకం అనేది చాలా ప్రత్యేకం. అది సాధిస్తే జీవితాంతం ఓ గుర్తింపు ఉంటుంది. నేను ఆ విజయాన్ని సాధించాలని అనుకుంటున్నాను. అందుకోసం గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నాను. బరువు తగ్గి శరీరాన్ని పూర్తి ఫిట్‌గా ఉంచుకున్నాను. ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అలాగే మేజర్ టోర్నీల్లో ఆడిన అనుభవం ఇక్కడ బాగానే ఉపయోగపడుతుంది.
ఇక ర్యాంకింగ్స్ అనేవి ఎప్పుడూ మారుతూ ఉండేవి. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను నేనెప్పుడూ అంటిపెట్టుకుని ఉండలేను. ఒలింపిక్స్‌లో రాణించాలనే ఒత్తిడి నాపై ఉంటుంది. వీలైనంత కాలం నా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తే సంతోషిస్తానని సోధి చెప్పాడు. రంజన్ సోధి గతేడాది అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా