Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

హైదరాబాద్: 2012కు సంబంధించి హైదరాబాద్ క్రీడాకారులకు తీపి గుర్తులున్నాయి. మన క్రీడాకారులు చరిత్రలో నిలిచిపోయే విజయాలు అందించారు. లండన్ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించారు. భారత క్రీడా సంఘాలపై అంతర్జాతీయ నిషేధం, కేంద్ర క్రీడల శాఖ వేటు వేయడం వంటి విషయాలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయి. మొత్తమ్మీద ఈ ఏడాది భారత క్రీడారంగానికి మంచీచెడులను అందించింది. అంతర్జాతీయ వేదికపైనా ఎన్నో సంచలనాలు, రికార్డులు, చేదు సంఘటనలకు 2012 సాక్షిగా నిలిచింది.

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పై అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య నిషేధం విధించింది. బాక్సింగ్ సంఘానికీ ఇదే అనుభవం ఎదురైంది. ఇక ఎన్నికల్లో నిబంధనలు ఉల్లఘించినందుకు బాక్సింగ్, ఆర్చరీ సంఘాలను కేంద్ర క్రీడల శాఖ రద్దుచేసింది. మొత్తానికి క్రీడా పాలకుల ఆధికార దాహం వల్ల ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ట దెబ్బతింది.

ఒలింపిక్స్ చరిత్రలో ఈ ఏడాది భారత్‌కు చిరస్మరణీయమైనది. మన క్రీడాకారులు అత్యధికంగా ఆరు పతకాలు సాధించింది లండన్ ఈవెంట్‌లోనే. హైదరాబాదీలు గగన్ నారంగ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. షూటింగ్‌లో నయా సంచలనం విజయ్ కుమార్ రజతం సాధించగా, స్టార్ బాక్సర్, ఇద్దరు పిల్లల తల్లి మేరీ కోమ్ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. ఇక రెజ్లింగ్ హీరోలు సుశీల్ కుమార్ (రజతం), యోగేశ్వర్ దత్ (కాంస్యం) పతకాలు సాధించారు.

అమెరికా స్విమ్మింగ్ సంచలనం మైకేల్ ఫెల్ప్స్ లండన్ ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆరు ప తకాలు సొంతం చేసుకున్న ఫెల్ప్స్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారుడిగా (మొత్తం: 22; 18 స్వర్ణ, 2 రజత, 2 కాంస్యాలు) ఖ్యాతి గాంచాడు.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

హైదరాబాదీ గగన్ నారంగ్ లండన్ ఒలింపిక్స్‌లో రైఫిల్ షూటింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ రకంగా భారత కీర్తి పతాకను ఒలింపిక్ క్రీడల్లో ఎగురేశాడు.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతాకం సాధించింది. ఆ రకంగా ఆమె రికార్డు సృష్టించింది.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

ఇద్దరు పిల్లల తల్లి మేరీ కోమ్ బాక్సింగ్‌లో ఒలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించింది. స్వర్ణపతకానికి దగ్గరగా వెళ్లి కాంస్య పతకం సాధించింది.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

ఇంగ్లండ్‌కు 76 ఏళ్లుగా అందని ద్రాక్షగా మారిన గ్రాండ్ స్లామ్ టైటిల్ కల ఫలించింది ఈ ఏడాదే. యూఎస్ ఓపెన్‌లో బ్రిటన్ టెన్నిస్ గ్రేట్ ఆండీ ముర్రే చాంపియన్‌గా నిలిచి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికాడు. ఫైనల్లో సెర్బియా యోధుడు జొకోవిచ్‌ను చిత్తుచేసి టైటిల్ అందుకున్నాడు. 1936 యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఫ్రెడ్ పెర్రీ నెగ్గాక, ఓ బ్రిటన్ ఆటగాడు గ్రాండ్‌స్లామ్ సాధించడం ఇదే తొలిసారి.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

అర్జెంటీనా, బార్సిలోనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఓ కేలండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో 86వ గోల్ సాధించిన మెస్సీఅప్పటిదాకా జర్మనీ లెజెండ్ జెర్డ్ ముల్లర్ పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

లండన్ ఒలింపిక్స్‌లో జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ సంచలనం సృష్టించాడు. బీజింగ్ గేమ్స్ 100, 200 మీటర్ల రేసుల్లో రికార్డు విజయాలు సాధించిన బోల్ట్ లండన్‌లోనూ ఇవే అంశాల్లో బంగారు పతకాలతో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా పసిడి పతకాలు గెలిచిన తొలి స్ప్రింటర్‌గా ఖ్యాతిగాంచాడు.

ఇయర్ వ్యూ: క్రీడల్లో మెరిసిన హైదరాబాదీలు (ఫోటోలు)

ప్రాణాంతక కేన్సర్‌ను జయించి సంచలన విజయాలతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన అమెరికా సైక్లింగ్ లెజెండ్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ దోషిగా నిలబడ్డాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో హీరో కాస్తా జీరో అయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ నెగ్గిన ప్రతిష్టాత్మక టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లను వెనక్కి తీసుకున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+