Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ అవుట్: భారత్‌కు షాక్

Wrestling thrown out of 2020 Olympics
లాసానే: భారతదేశానికి ఐఓసి షాక్ ఇచ్చింది. ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్‌ను తొలగించాలని ఐఓసీ నిర్ణయించింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారత రెజ్లింగ్‌కు ఐఓసీ తీసుకున్న నిర్ణయం శాపంగా మారింది. మంగళవారం ఇక్కడ సమావేశమైన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 2020 ఒలింపిక్స్‌లో ప్రధానమైన క్రీడల జాబితా నుంచి రెజ్లింగ్‌ను తొలగించింది.

అయితే, రెజ్లింగ్‌కన్నా ఎక్కువ రిస్క్‌తో కూడిన పెంటాథ్లాన్‌ను మాత్రం కొనసాగిస్తోంది. 26 ప్రధాన క్రీడాంశాలపై సమీక్ష నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ - ఈ జాబితా నుంచి ఒక క్రీడను తప్పించి మరో క్రీడకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో కొనసాగే కుస్తీ, 2020లో మళ్లీ చోటు దక్కించుకోవాలంటే బేస్‌బాల్, కరాటే, స్క్వాష్, రోలర్ స్పోర్ట్స్, క్లయింబింగ్, వేక్ బోర్డింగ్, వుషులతో పోటీ పడాల్సి ఉంటుంది.

తుది నిర్ణయం మాత్రం బ్యూనస్ ఎయిర్స్‌లో సెప్టెంబర్‌లో జరిగే జనరల్ అసెంబ్లీలో తీసుకుంటారు. బీజింగ్ ఒలింపిక్స్ ముందు సాఫ్ట్‌బాల్‌ను ఒలింపిక్స్ నుంచి తొలగించిన ఐఓసి - రియో ఒలింపిక్స్‌లో గోల్ఫ్, రగ్బీలకు చోటు కల్పించింది. ఇక 1912 స్టాక్‌హోమ్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన మోడ్రన్ పెంటాథ్లాన్.. 2020లో కొనసాగేందుకు యూనియన్ ఇంటర్నేషనల్ పెంటాథ్లాన్ మోడర్నె (యూఐపీఎం) సంస్థ చేసిన లాబీయింగ్ సత్ఫలితాలనిచ్చింది. లాబీయింగ్‌లో వెనకబడ్డ రెజ్లింగ్ సంఘం ఉద్వాసనకు గురైంది.

1952 హెల్సింకీ ఒలింపిక్స్ బాంటమ్ వెయిట్‌లో దాదాసాహెబ్ జాదవ్ కాంస్యం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ 66 కిలోల ఫ్రీ స్టయిల్లో కాంస్య పట్టు పట్టిన సుశీల్ కుమార్, లండన్‌లో రజతం అందుకున్నాడు. యోగేశ్వర్ లండన్ఒలింపిక్స్ 60 కి. ఫ్రీస్టయిల్‌లో కాంస్యం దక్కించుకున్నాడు.

ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్‌ను తొలగించారనే వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అన్నాడు. 2020 ఒలింపిక్స్ నుంచి తొలగించాలని ఐఓసీ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని చెప్పాడు. భారత ప్రభుత్వ జోక్యం చేసుకుని రెజ్లింగ్ కొనసాగేలా ఒత్తిడి చేయాలని దత్ డిమాండ్ చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+