Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్కమ్యాచ్ గెలిస్తే..:రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన సుశీల్

Sushil Kumar
లండన్: లండన్ ఒలింపిక్స్ 2012ల్లో భారత్ తన ఖాతాలో మరో పతకం వేసుకోనుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లింగ్ పోటీలలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. సుశీల్ కుమార్ కజకిస్తాన్ రెజ్లర్ అజ్‌హురేక్‌పై సెమీ ఫైనల్లో విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. పతకం ఖాయమైంది. వరుసగా రెండు ఒలంపిక్స్‌లలో మెడల్స్ సాధించిన భారత ఆటగాడిగా సుశీల్ చరిత్ర సృష్టించారు.

అంతకుముందు 66 కిలోల ఫ్రీ స్టైల్‌ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ ఉజ్జెకిస్తాన్ రెజ్లర్ ఇక్తియార్ పైన క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించాడు. సుశీల్ చాకచక్యంగా పోరాట పటిమ చాటుతున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఏదో ఒక పతకం ఖాయమని అందరూ అభిప్రాయానికి వచ్చారు.

క్వార్టర్ ఫైనల్లో సుశీల్ ఇక్తియార్‌పై సునాయాస విజయం సాధించాడు. అంతకుముందు ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో కూడా టర్కీకి చెందిన రెజ్లర్ శాహిన్ రమజాన్ పైన ఘన విజయమే సాధించాడు. సుశీల్ భారత్‌కు మరో పతకం తీసుకు రావడం ఖాయం కావడంతో భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్నాడు.

సుశీల్ సెమీ ఫైనల్లో కజకిస్తాన్ రెజ్లర్ అజ్‌హురెక్‌తో తలపడి గెలిచాడు. అజ్‌హురెక్‌ అర్మేనియా దేశానికి చెందిన సఫర్యాన్‌ను 3-1తో ఓడించి సెమీ ఫైనల్లో అడుగు పెట్టాడు. కాగా ఇప్పటికే భారత్ తన ఖాతాలో ఐదు పతకాలు వేసుకుంది. సుశీల్ కుమార్ పతకంతో భారత్ ఖాతాలో ఆరు పతకాలు కానున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+