
రికార్డు పుస్తకాల నుంచి ఆర్మ్‌స్ట్రాంగ్ పేరును తొలగించడమే కాకుండా 1999-2005 మధ్యకాలంలో అతను సాధించిన ఏడు టైటిళ్లనూ వెనక్కి తీసుకుంటున్నట్టు యూసీఐ అధ్యక్షుడు ప్యాట్ మెక్ ఖయాద్ సోమవారం తెలిపాడు. సైక్లింగ్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు చోటే లేదు. యూఎస్ఏడీఏ సమర్పించిన నివేదికను యూసీఐ ఆమోదించిందని మెక్ ఖయాద్ చెప్పారు. క్రీడలకు మచ్చతెచ్చిన అతడిపై మరో ఆలోచన లేకుండా నిషేధం విధించామని తెలిపాడు.
ఆర్మ్‌స్ట్రాంగ్ అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ ప్రణాళిక ప్రకారం డోపింగ్‌కు పాల్పడ్డాడని, గతంలో ఇలాంటి మహా కుట్ర జరగలేదని యూఎస్ఏడీఏ ఈ నెల 10న తన నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలపై కోర్టుకెళ్లే యోచన లేదని అంటూనే తానెప్పుడూ డోప్ టెస్టులో విఫలం కాలేదని ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పాడు. అయితే నివేదికను పరిశీలించిన యూసీఐ ఆర్మ్‌స్ట్రాంగ్ డోపింగ్‌కు పాల్పడ్డాడని నిర్ధారణకు రావడంతో అతనిపై నిషేధం వేటు వేసింది. అయితే, 1999-2005 మధ్యకాలంలో ఆర్మ్‌స్ట్రాంగ్ డోపింగ్‌కు పాల్పడ్డాడంటూ సాక్ష్యం చెప్పిన అతని జట్టు సభ్యులను అధికారులు నిషేధం నుంచి మినహాయించారు.
సైక్లింగ్‌లో డోపింగ్‌కు పాల్పడడం ఇదే తొలిసారి కాదని మెక్ ఖయాద్ అన్నాడు. 2005లో తాను యూసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డోపింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నానని చెప్పాడు. 'సైక్లింగ్‌కు మంచి భవిష్యత్ ఉంది. ఇక్కడ డోపింగ్ ఆరోపణలు కొత్తేమీ కాదని అన్నాడు. యూఎస్ఏడీఏ నివేదికను మేనేజ్‌మెంట్ కమిటీలో చర్చించిన తర్వాతే ఆర్మ్‌స్ట్రాంగ్‌పై నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.