Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పేస్‌తో జోడీ: ఎవరీ విష్ణువర్ధన్, ఎలా చాన్స్?

Vishnu Vardhan
హైదరాబాద్: ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఆంధ్రప్రదేశ్ పురుష టెన్నిస్ క్రీడాకారుడు జె. విష్ణు వర్ధన్. వరల్డ్ నెంబర్ 7, ఇండియా నెంబర్ వన్ క్రీడాకారుడు లియాండర్ పేస్‌తో ఒలింపిక్స్‌లో జత కట్టే అవకాశం విష్ణు వర్ధన్‌కు దక్కింది. పేస్‌తో జత కట్టడానికి మహేష్ భూపతి, రోహన్ బోపన్న వంటి క్రీడాకారులు నిరాకరించడంతో ఆ అవకాశం విష్ణు వర్ధన్‌కు దక్కింది. ఈ అవకాశాన్ని తాను వాడుకుంటానని, దేశానికి పతకం సాధించి పెట్టేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని విష్ణు వర్ధన్ అంటున్నాడు.

విష్ణువర్ధన్ వరల్డ్ ర్యాంకింగులో 328వ స్థానంలో ఉన్నాడు. అయితే, ఇటీవల అతను సాధించిన విజయాలు అతనికి పేస్‌తో జత కట్టే అవకాశాలను కల్పించాయని అంటున్నారు. చైనాలో జరిగిన 2010 ఆసియా క్రీడల్లో కాంస్య సాధించిన భారత జట్టులో అతను ఉన్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో జత కట్టి వెండి పతకం సాధించాడు. భారత టెన్నిస్‌కు సంబంధించి పేస్, మహేష్ భూపతి వారసుడిగా విష్ణువర్ధన్ ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

డేవిస్ కప్‌కు అతను ప్రాతినిధ్యం వహించాడు. ఉజ్బెకిస్తాన్, పిలిప్పైన్స్‌లను ఓడించి వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించిన జట్టులో అతను ఉన్నాడు. విష్ణు తొలిసారి డేవిస్ కప్‌లో సెప్టెంబర్‌ 18వ తేదీన జపాన్‌కు చెందిన కీ నిషికోరీతో తలపడ్డాడు. అయితే, వరుస సెట్లలో అతను ఓడిపోయాడు.

హైదరాబాదుకు చెందిన విష్ణువర్ధన్ 1987 జులై 27వ తేదీన జన్మించాడు. 2003లో అతను జూనియర్ నేషనల్ టైటిల్ గెలుచుకున్నాడు. డేవిస్ కప్ జూనియర్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. డేవిస్ కప్‌లో పేస్‌తో కలిసి తాను ప్రాక్టీస్ చేసినట్లు విష్ణువర్ధన్ తెలిపాడు. ఒలింపిక్స్ కోసం లండన్ వెళ్లి ప్రాక్టీస్ చేస్తానని అతను అన్నాడు. డబుల్స్‌లో ర్యాంకింగ్ మెరుగ్గా ఉండడంతో పేస్‌తో జత కట్టే అవకాశం విష్ణువర్ధన్‌కు దక్కినట్లు భావిస్తున్నారు. తనకు ఇది మంచి అవకాశమని అతను భావిస్తున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+