Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలిచి బరిలో నిలిచిన ఇంగ్లండ్, ఇంటి దారి పట్టిన స్వీడన్

Welbeck and Walcott rescue England as Sweden out |
కీవ్ (ఉక్రెయిన్), జూన్ 17: యూరో కప్‌లో మరో జట్టు ఇంటికి వెళ్లింది . గ్రూప్-డిలో స్వీడన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుని నాకౌట్ రేసుకు ముందే ఇంటి దారి పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ 'డి' లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3-2 గోల్స్ తేడాతో స్వీడన్‌ను ఓడించింది. ఇంగ్లండ్ తరఫున కారోల్ (23వ నిమిషంలో), థియో వాల్కట్ (64వ నిమిషంలో), డానీ వెల్‌బెక్ (78వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... స్వీడన్‌కు మెల్‌బెర్గ్ (49వ, 59వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. గ్రూప్ 'డి'లో రెండో రౌండ్ మ్యాచ్‌లు ముగిశాక ఫ్రాన్స్, ఇంగ్లండ్ నాలుగేసి పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన స్వీడన్ 'యూరో' నుంచి నిష్ర్కమించింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

గతంలో విధించిన రెండు మ్యాచ్‌ల నిషేధం కారణంగా స్టార్ ప్లేయర్ వేన్ రూనీ లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదటి అర్ద భాగంలో అద్బుతంగా ఆడింది. ఆట 23వ నిమిషంలో కెప్టెన్ జెరార్డ్ కొట్టిన క్రాస్ పాస్‌ను 'డి' ఏరియాలో ఉన్న కారోల్ 'హెడర్' షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు.

ఇంగ్లీష్ స్ట్రయికర్ గ్లెన్ జాన్సన్ (49వ ని) సెల్ఫ్ గోల్ చేసి స్వీడన్‌కు ఉపకారం చేశా డు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. కొద్దిసేపటి తర్వాత స్వీడన్ ఆటగాడు మెల్‌బర్గ్ (59వ) గోల్ చేయడంతో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ఆ వెంటనే ఇంగ్లండ్ స్ట్రయికర్ వాల్కాట్ (64వ) బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి నెట్టి స్కోరును సమం చేశాడు. ఈ దశలో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. 78వ నిమిషంలో గోల్ పోస్ట్ ముందు వెల్‌బెక్ చాకచక్యమైన షాట్‌తో బంతిని స్వీడన్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశాడు. ఆఖరి మ్యాచ్‌కు ఇంగ్లండ్‌కు స్టార్ ఆటగాడు రూనీ అందుబాటులో ఉంటాడు.

యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో ప్రెమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు డెన్మార్క్ వర్సెస్ జర్మనీ

రాత్రి 12.15 గంటలకు నుంచి పోర్చుగల్ వర్సెస్ నెదర్లాండ్స్

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+