Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జైల్లో జంతువులాగా, పింకీ సంచలన వ్యాఖ్యలు

Pinki Pramanik
రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడిలిస్ట్ పింకీ ప్రామాణిక్ జైలు నుండి విడుదలై బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జైలు నుండి విడుదలైన పింకీ ప్రామాణిక్ మీడియాతో మాట్లాడుతూ నా ఛాయాచిత్రాలను ఉపయోగించి నా రూమ్ మేట్ నన్ను బెదిరించడమే కాకుండా, ఇప్పుడు నన్ను ఈ రేప్ కేసులో ఇరికిందని చెప్పింది. నా లాయర్‌తో చర్చించిన తర్వాత ఆమెపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో, నిర్ణయం తీసుకుంటానని పేర్కోంది.

జైలులో నేను గడిపిన 26 రోజులు నా జీవితంలో మరిచిపోలేనని అన్నారు. లింగనిర్దారణ పరీక్ష సమయంలో హాస్పిటల్‌లో నన్ను ఓ జంతువులాగా వ్యవహరించారని ఆమె పేర్కొంది. రేప్ కేసులో బర్సాత్ కోర్టు మంగళవారం అథ్లెట్ పింకీ ప్రామాణిక్ బెయిల్ మంజూరు చేసింది. 26 రోజుల పాటు దండం సెంట్రల్ జైలులో గడిపిన పింకీ ప్రామాణిక్ తన రుమ్ మేట్ చేసిన ఫిర్యాదు మేరకు రేప్ కేసులో గత నెల 14వ తారీఖున అరెస్టు చేశారు. ఇది ఇలా ఉంటే పింకీ ప్రామాణిక్‌పై జరిపిన లింగ నిర్దారణ రిపోర్ట్‌లను నిన్న మధ్యాన్నం కోర్టుకు సమర్పించారు.

పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనెవెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది.

ఇటీవలే ఈమె పై రేప్ కేసు నమోదైంది. అత్యంత ఆశ్చర్యకరంగా, పింకీ మహిళ కాదని, పురుషుడనీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్రాగుటీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎంతోకాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన పింకీ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను బలాత్కరించినట్టు ఆరోపించింది. పింకీ మహిళ కాదని, తప్పుడు సర్ట్ఫికెట్లతో మహిళల విభాగంలో పోటీపడినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని భారత అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేసింది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+