
జట్టు సభ్యుల సంఖ్య ప్రకారం వారి వెంటవెళ్లే అధికారులు 50 శాతానికి మించకూడదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తాత్కాలిక అధ్యక్షుడు వీకే మల్హోత్రా అన్నారు. ఏడుగురు టెన్నిస్ ఆటగాళ్లు లండన్‌కు వెళుతున్నారు కాబట్టి వారి వెంట ముగ్గురు సహాయకులకు మాత్రమే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇవన్నీ నిబంధలను మేం చెప్పామని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) ఒకవైపు చెప్తూ.. మరో వైపు ప్రతి ఆటగాడి వెంట వ్యక్తిగత కోచ్ ఉండాలని వారు పట్టుబట్టారని తెలిపింది.
ముగ్గురు సహాయకులు గేమ్స్ విలేజ్‌లో ఉండి... మరో ఇద్దరు మాత్రం పోటీలు జరిగే రోజుల్లో స్టేడియంకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపాం. దీనిపై స్పందించిన టెన్నిస్ అసోసియేషన్... గతంలో ఫెడరేషన్ కప్, ఆసియా క్రీడలు... తదితర ఈవెంట్లలో నసీమా గతంలో జట్టు మేనేజర్‌గా పనిచేశారని సమాధానం ఇచ్చింది. టెన్నిస్‌లో ఆమెకు ఎంతో అనుభవం ఉంది కాబట్టే ఎంపిక చేశామని వివరించింది. భారత టెన్నిస్ నుంచి ఏడుగురు ఆటగాళ్లతో పాటు ఐదుగురు అధికారులు లండన్‌కు వెళ్లనున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు అధికారులు గేమ్స్ విలేజ్‌లో ఉంటారని వివరించింది.
తెలుగు వన్ఇండియా