
రెండు రోజుల క్రితం మహిళల డిస్కస్ త్రోలో కృష్ణ పూనియా ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ.. ఏడవ స్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో వికాస్ గౌడ ఫైనల్‌కు క్వాలిపై అవలేదు. కానీ లండన్ ఒలంపిక్స్‌లో క్వాలిఫై అవడంతో పాటు పైనల్‌లో ఎనిమిదవ స్దానంలో నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో వికాస్ గౌడ 60.69 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో 22వ స్దానంలో ఇంటికి చేరాడు. వికాస్ గౌడ పర్సనల్ బెస్ట్ 66.28 మీటర్లు. ఇదే జాతీయ రికార్డు కూడా.
మొదటి ప్రయత్నంలో 64.79 మీటర్ల దూరం విసిరిన వికాస్... ఆ తర్వాత వరుసగా 60.95, 63.03, 64.15, 64.48, 63.89 మీటర్ల దూరం విసిరాడు. క్వాలిఫయింగ్‌లో 65.20మీ. దూరం విసిరినా... వికాస్ ఫైనల్లో అదే ఫెర్పామెన్స్‌ని కొనసాగించలేకపోయాడు. ఇది ఇలా ఉంటే పురుషుల డిస్కస్ త్రోలో జర్మనీకి చెందిన హార్టింగ్ రాబర్ట్ 68.27 మీ.తో స్వర్ణం సాధించాడు.
ఇరాన్‌కు చెందిన హదాది ఎహ్‌సాన్ 68.18మీ.తో రజతం, ఎస్టోనియాకు చెందిన క్యాంటర్ గెర్డ్ 68.03మీ.తో కాంస్యం గెలుచుకున్నారు. చివరి ప్రయత్నంలో హదాది... హార్టింగ్ కంటే ఎక్కువదూరం డిస్క్ విసిరినా ఫౌల్ అవడంతో, రజతాన్ని సొంతం చేసుకున్నాడు.
తెలుగు వన్ఇండియా