
తాము డ్రగ్స్‌కు బానిసలం కాలేదని చెప్పాడు. తాను, విజేందర్ మూడు నాలుగు సార్లు అనూప్ సింగ్ కహ్లోన్‌ను కలిశామని రామ్ సింగ్ చెప్పాడు. రామ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అయితే, తనకు డ్రగ్ డీలర్ అనూప్ సింగ్ కహ్లోన్‌తో ఏ విధమైన సంబంధాలు లేవని విజేందర్ సింగ్ శుక్రవారం చెప్పాడు.
కహ్లోన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చండీఘడ్ శివారులో ఉన్న జిరాక్‌పూర్ ఆపార్టుమెంటులో పోలీసులు సోదాలు నిర్వహించారు. కహ్లోన్‌ను పోలీసులు మార్చి 3వ తేదీన అరెస్టు చేశారు. తనకు జాతీయ బాక్సర్ రామ్ సింగ్ తెలుసునని కహ్లోన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రామ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు.
మొహాలీ జిల్లాలోని జిరక్‌పూర్‌లోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు రూ.130 కోట్ల విలువైన 16 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.యితే, ఈ హెరాయిన్‌కు భారత స్టార్ బాక్సింగ్ ఛాంపియన్ విజేందర్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారిస్తున్నారు. హెరాయిన్ దొరికిన స్థలంలో విజేందర్ సింగ్ భార్య పేర రిజిష్టర్ అయిన కారు ఉన్నట్లుగా చెబుతున్నారు.
డ్రగ్ వ్యవహారంలో విజేందర్, రామ్ సింగ్ పాత్రల గురించి ఇప్పుడే ధ్రువీకరించలేమని ఫతేనగర్ పోలీసు సూపరింటిండెంట్ హర్దయాల్ సింగ్ చెప్పారు. విజేందర్, రామ్ సింగ్‌లు కహ్లోన్, అతని అనుచరుడు రాకీ తెలుసునని ఆయన అన్నారు. రాకీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.